
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 95


అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ప్రారంభం ఆ రోజేనా ?

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అజయ్ భూపతి

మరోసారి `అర్జున్ రెడ్డి` జోడీ?

తెలంగాణ లో శేఖర్ కమ్ముల మూవీ షూటింగ్

మెగాస్టార్ చిత్రంలో శ్రుతి హాసన్?

ప్రేమ కథా చిత్రమ్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

కెప్టెన్ మార్వెల్ మూవీ మౌత్ టాక్

నాలుగు భాషలలో టీజర్ రిలీజ్

లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

సైరా కోసం చివరిసారిగా

అర్జున రిలీజ్ డేట్ ఖరారు

సీక్వెల్‌లో తమన్నా?

అయోగ్య రిలీజ్ డేట్ ఖరారు

తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న శర్వానంద్?

భారీ రేట్లతో నాన్ థియేట్రికల్ రైట్స్

'సర్వం తాళ మయం'పై కళాతపస్వి ప్రశంసలు

సినిమా రంగంలో మహిళా విజయం ( మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
" ముదితల్ నేర్వగరాని విద్యను గలవే ముద్దార నేర్పించినన్" అంటాడు భర్తృహరి. నిజంగానే ప్రేమ మీరగా నేర్పిస్తే ఆడవాళ్లకు అబ్బని విద్యగాని, అందుకోలేని విజయంగాని ఏదీ లేదు. విద్యా,వైద్య, వ్యాపార, రాజకీయ, శాస్త్ర, వైజ్ఞానిక, క్రీడా, కళాది రంగాలలో స్త్రీలు సాధించిన విజయాలు, వారు నెలకొల్పిన రికార్డులు మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నరకాసుర వధలో సత్యభామ సాహసం, స్వతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ చాతుర్యం ఇవన్నీ మహిళా విజయానికి ప్రతీకలుగా నిలిచే విశేషాలు.

అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ప్రారంభం ఆ రోజేనా ?
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, S/O సత్యమూర్తి మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ హిట్ కాంబినేషన్ లో మూడవసారి ఈ మూవీ రూపుదిద్దుకోనుంది.

`చిత్రలహరి` కోసం డబ్బింగ్ చెప్పుకోనున్న కళ్యాణి ప్రియదర్శన్?
`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కళ్యాణి... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రెండు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం... ఇలా మొత్తం ఐదు సినిమాలతో కళ్యాణి బిజీగా ఉందిప్పుడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అజయ్ భూపతి
ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతికి మరియు హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కు కూడా మంచి క్రేజ్ రావడంతో పాటు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే హీరో,హీరోయిన్స్ పలు ప్రాజెక్టులలో బిజీ కాగా దర్శకుడు అజయ్ ఓ భారీ చిత్రం కమిటైనట్టు తెలుస్తోంది.

మరోసారి `అర్జున్ రెడ్డి` జోడీ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని కీలక మలుపు తిప్పిన చిత్రం `అర్జున్ రెడ్డి` (2017). ఆ సినిమాతోనే తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది షాలినీ పాండే. అర్జున్ రెడ్డి, ప్రీతి పాత్రల్లో విజయ్, షాలిని జంట యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. మళ్ళీ రెండేళ్ళ తరువాత ఈ జోడీ మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతోందట.

వేసవిలో క్యూ కడుతున్న ఆసక్తికరమైన చిత్రాలు
ఎప్పటిలాగే ఈ ఏడాదిలో కూడా వేసవి బరిలో ఆసక్తికరమైన సినిమాలు సందడి చేయనున్నాయి. మార్చి ద్వితీయార్ధంతో మొదలై జూన్ ప్రథమార్ధంతో ముగిసే ఈ సీజన్‌లో... దాదాపు ప్రతీ వారం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 5న యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా నటించిన `మజిలీ` విడుదల కానుండగా... 12న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్న `చిత్ర లహరి` తెరపైకి రానుంది. ఇక అదే నెల 19న నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా…

తెలంగాణ లో శేఖర్ కమ్ముల మూవీ షూటింగ్
నేషనల్ అవార్డు విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫిదా మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రం లోని బాన్సువాడ లో జరిగింది. పల్లెటూరు వాతావరణం కొరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గోదావరి జిల్లాలలో షూటింగ్స్ జరిగేవి. తెలంగాణ లో కూడా పల్లెటూర్లు అందంగా ఉంటాయని శేఖర్ కమ్ముల ఫిదా మూవీ ద్వారా తెలియజేశారు.

మెగాస్టార్ చిత్రంలో శ్రుతి హాసన్?
మెగా కాంపౌండ్ హీరోలకు కలిసొచ్చిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `గబ్బర్ సింగ్`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `రేసు గుర్రం`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో `ఎవడు` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రుతి... ఆ యా చిత్రాలతో మంచి విజయాలను నమోదు చేసుకుంది. అయితే... పవన్ కళ్యాణ్‌తోనే మరోసారి కలసి నటించిన `కాటమ రాయుడు` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత మళ్ళీ తెలుగులో నటించని శ్రుతి... దాదాపు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో మెగా మూవీతోనే తెలుగునాట రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాలీవుడ్ టాక్.

ప్రేమ కథా చిత్రమ్ 2 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
మారుతి దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన హారర్ కామెడీ ప్రేమకథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఒకపక్క భయపెడుతూనే... మరోపక్క నవ్విస్తూ.. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేశారు. ఇప్పుడు ప్రేమకథా చిత్రమ్ -2 బ్యాక్ టు ఫియర్ అనే క్యాప్షన్ తో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కెప్టెన్ మార్వెల్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

నాలుగు భాషలలో టీజర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమా బ్యానర్స్ పై విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం లో ఫైట్ ఫర్ వాట్ యు లవ్ క్యాప్షన్ తో డియర్ కామ్రేడ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా , రష్మిక క్రికెటర్ గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏయే అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభమప్పుడే చెప్పడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఓ రకంగా క్రిష్ తీసిన బయోపిక్ కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు.

సైరా కోసం చివరిసారిగా
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టే.

అర్జున రిలీజ్ డేట్ ఖరారు
కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 'అర్జున' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని... ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమారిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15 (మార్చి15) వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సీక్వెల్‌లో తమన్నా?
ఈ సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో భారీ విజయాన్ని అందుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా... మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ `సైరా నరసింహారెడ్డి`లో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే... `క్వీన్` రీమేక్ `దటీజ్ మహాలక్ష్మి` విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే... `అభినేత్రి`, `దటీజ్ మహాలక్ష్మి` తరువాత మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.

సాహో తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బాహుబలి
ఒక్క సినిమా ప్రభాస్ స్థాయినే మార్చేసింది. సినిమా తీయడానికి, రావడానికి ఎక్కువ టైం తీసుకున్నా... ఆ సినిమా రిలీజైన తరువాత వచ్చిన ఫేమ్, నేమ్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. అలా ప్రభాస్ సినీ కెరీర్ లో వచ్చిన బాహుబలి సినిమా తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజానికి బాహుబలి ముందు ప్రభాస్ మన రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇంకా చెప్పుకుంటే సౌత్ కు మాత్రమే ఎక్కువ తెలుసు. కానీ బాహుబలి తరువాత నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

అయోగ్య రిలీజ్ డేట్ ఖరారు
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'టెంపర్' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పూరీ తన సినిమాలో హీరోని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ ఒకే నటనకు అలవాటు పడిన హీరోలను సైతం కొత్తగా చూపించి.. వారిలో ఉన్న మరో యాంగిల్ ను బయటకు తీసుకొస్తాడు. అలాగే ఎన్టీఆర్ ను కూడా ఈసినిమాలో కొత్తగా చూపించాడు. అది కూడా ఈ సినిమా విజయానికి మరో కారణం అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ ను ఈసినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

తక్కువ గ్యాప్‌లోనే వస్తున్న శర్వానంద్?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు శర్వానంద్. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ హీరో... ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి సుధీర్ వర్మ రూపొందిస్తున్న పేరు నిర్ణయించని చిత్రం కాగా... మరొకటి తమిళ్ బ్లాక్‌బస్టర్ మూవీ `96`కి రీమేక్‌గా రూపొందుతున్న సినిమా. ఈ రెండు కూడా కేవలం మూడు నెలల గ్యాప్‌లో తెరపైకి వచ్చే అవకాశముందని టాలీవుడ్ టాక్.

భారీ రేట్లతో నాన్ థియేట్రికల్ రైట్స్
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య మూవీస్ తరువాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 4వ సినిమా మజిలీ. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా నటించిన ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

'సర్వం తాళ మయం'పై కళాతపస్వి ప్రశంసలు
జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో సంగీత నేపథ్యంలో తెరకెక్కిన కొత్త సినిమా సర్వం తాళ మయం. మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి క్లాసిక్ మూవీస్ ను అందించిన రాజీవ్ మీనన్.. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.