అయోగ్య రిలీజ్ డేట్ ఖరారు

Vishal Ayogya Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ayogya Movie Release Date Fixed,Ayogya Movie Release Date Confirmed,Ayogya Movie Release Date Announced,Ayogya Movie Gets a Release Date,Ayogya Movie Release Date Unveiled,Vishal Ayogya Movie Latest Updates
Vishal Ayogya Movie Release Date Locked

తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి పూరీ తన సినిమాలో హీరోని ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ ఒకే నటనకు అలవాటు పడిన హీరోలను సైతం కొత్తగా చూపించి.. వారిలో ఉన్న మరో యాంగిల్ ను బయటకు తీసుకొస్తాడు. అలాగే ఎన్టీఆర్ ను కూడా ఈసినిమాలో కొత్తగా చూపించాడు. అది కూడా ఈ సినిమా విజయానికి మరో కారణం అని చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ ను ఈసినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాను అటు తమిళ్ లోనూ రీమేక్ చేస్తుండగా.. హిందీలో రీమేక్ చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. హిందీలో ‘సింబా’ పేరుతో విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రూపొందుతుది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. కాగా వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ సరసన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుంది. పార్తీబన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మరి తెలుగు.. హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా, తమిళంలో ఎంత వరకూ విజయం దక్కించుకుంటుందో.

[subscribe]

[youtube_video videoid=Q4CFWcT5hPc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =