ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతికి మరియు హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కు కూడా మంచి క్రేజ్ రావడంతో పాటు ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే హీరో,హీరోయిన్స్ పలు ప్రాజెక్టులలో బిజీ కాగా దర్శకుడు అజయ్ ఓ భారీ చిత్రం కమిటైనట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా మాఫియా నేపథ్యంలో ఉండబోతుందట. అంతేకాదు ఈసినిమాకు అప్పుడే ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. మరి ఆర్ఎక్స్ 100 తో భారీ విజయం సాధించిన అజయ్ భూపతి ఈ చిత్రం తో కూడా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.
[youtube_video videoid=j5gep8t7CJA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: