సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా గత కొద్ది కాలంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. దాదాపు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్టే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ నెల 13నుండి 16 వరకూ అక్కడే షూటింగ్ జరుపుకోనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం… ఈ షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ పాల్గొననున్నారట. ఇదివరకే ఒక షెడ్యూల్ లో పాల్గొన్న అమితాబ్ ఇక ఇప్పుడు ఆఖరిసారిగా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్ తో అమితాబ్ షెడ్యూల్ పూర్తవుతుందట.
కాగా ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయన తార, తమన్నా, సుధీప్, విజయ సేతుపతి లాంటి తదితర ప్రముఖ నటీనటులు ఎందరో ఇందులో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[youtube_video videoid=eVR5aHxO5AQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: