సాహో తో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బాహుబలి

Shades of Saaho Chapter 2 Breaks Records and Creates History,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shades Of Saaho Chapter 2 Sets a Record in Social Media,Shades Of Saaho Chapter 2 Creates a Record,Saaho Movie Latest Updates,Shades Of Saaho Chapter 2 Record Breaks Again,Shades Of Saaho Chapter 2 Breaks All Records
Shades of Saaho chapter 2 breaks records and creates history

ఒక్క సినిమా ప్రభాస్ స్థాయినే మార్చేసింది. సినిమా తీయడానికి, రావడానికి ఎక్కువ టైం తీసుకున్నా… ఆ సినిమా రిలీజైన తరువాత వచ్చిన ఫేమ్, నేమ్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది. అలా ప్రభాస్ సినీ కెరీర్ లో వచ్చిన బాహుబలి సినిమా తన కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజానికి బాహుబలి ముందు ప్రభాస్ మన రెండు తెలుగు రాష్ట్రాలు.. ఇంకా చెప్పుకుంటే సౌత్ కు మాత్రమే ఎక్కువ తెలుసు. కానీ బాహుబలి తరువాత నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బాహుబలి ఎఫెక్ట్ అప్పుడే పోదు కాబట్టి.. ఆ ఎఫెక్ట్ తన అప్ కమింగ్ సినిమాలపై కూడా పడుతుంది. అందుకే ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా తాను కూడా సాహో లాంటి మరో భారీ బడ్జెట్ మూవీతోనే వస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా భారం ప్రభాస్ పైనే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. బాహుబలి అంటే రాజమౌళి కూడా ఉన్నాడు కాబట్టి అంత భారం మోయాల్సిన అవసరం లేదు.. కానీ.. సాహో పరిస్థితి వేరు.. ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ఒకే ఒక్క సినిమా తీశాడు. అది కూడా పెద్ద హీరోతో కాదు. దీంతో ప్రభాస్ భుజాలపైనే ఈ సినిమా భారం ఎక్కువ ఉంది. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా తొణకకుండా మరలా తనదైన బెంచ్ మార్క్ ను సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇక తన సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ తన సినిమాతోనే పాత రికార్డులు చెరిపేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు. దీనికి కారణం సినిమా మేకింగ్ విజువల్స్ ను షేడ్స్ ఆఫ్ సాహో అనే పేరుతో ఇప్పటివరకు రెండు చాఫ్టర్స్ గా విడుదల చేయగా వాటికి వచ్చిన వ్యూసే. హీరోయిన్ శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా మార్చి 3 న షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2 విడుదల చేయగా.. అతి తక్కువ కాలంలోనే హైయెస్ట్ వ్యూస్ ను సాధించి సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలోని అన్ని ఫ్లాట్ ఫామ్స్ లో కలిపి 24 గంటల్లో ఈ వీడియోకు 12 మిలియన్స్ వ్యూస్ రాగా.. 2.9 మిలియన్స్ లైక్స్ ను సొంతం చేసుకుంది. 79 మిలియన్ వ్యూస్ తో మోస్ట్ పాపులర్ వీడియో జాబితాలో చేరింది. అంతేకాదు.. మేకింగ్ వీడియో జాబితాలో 12 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని మరో రికార్డు సాధించింది. మరి జస్ట్ ఈ వీడియోస్ కే ఇంతలా ఉంటే ఈ సినిమా నుండి టీజర్ కానీ, ట్రైలర్ కానీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అందుకే ముందు చెప్పినట్టు.. బాహుబలి సినిమాతో రికార్టులు క్రియేట్ చేసిన ప్రభాస్ సాహో సినిమాతో ఆ రికార్డులను తానే చెరిపేస్తూ.. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. మరి భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా వస్తున్న సాహో కూడా తప్పకుండా ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవాలని కోరుకుందాం..

[subscribe]

[youtube_video videoid=Z6WlMvYEc3Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.