అర్జున రిలీజ్ డేట్ ఖరారు

కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ‘అర్జున’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని… ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమారిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15 (మార్చి15) వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మరియమ్ జకారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఓ కీలకమైన పాత్రను పోషించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక గరుడ వేగ తరువాత రాజశేఖర్ కల్కి సినిమా చేస్తున్నట్టు అందరికీ తెలుసు కానీ.. ఈసినిమా గురించి పెద్దగా ఎక్కడా వార్తలు వచ్చినట్టు కూడా లేదు. మరి పెద్దగా ప్రచారం, హడావిడి లేకుండా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=7KUQx76_uaU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 7 =