మెగా కాంపౌండ్ హీరోలకు కలిసొచ్చిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `గబ్బర్ సింగ్`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `రేసు గుర్రం`, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో `ఎవడు` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రుతి… ఆ యా చిత్రాలతో మంచి విజయాలను నమోదు చేసుకుంది. అయితే… పవన్ కళ్యాణ్‌తోనే మరోసారి కలసి నటించిన `కాటమ రాయుడు` మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత మళ్ళీ తెలుగులో నటించని శ్రుతి… దాదాపు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో మెగా మూవీతోనే తెలుగునాట రీ ఎంట్రీ ఇవ్వబోతోందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌లో ఓ కీలక పాత్ర కోసం శ్రుతిని సంప్రదించాడట కొరటాల. సినిమాని కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని సమాచారం. ఇదివరకు కొరటాల దర్శకత్వంలో రూపొందిన `శ్రీమంతుడు` చిత్రం శ్రుతికి నటిగా మంచి పేరు తీసుకువచ్చిన నేపథ్యంలో…. కొరటాల కొత్త చిత్రంలో నటించేందుకు శ్రుతి కూడా ఆసక్తి చూపిస్తోందని టాక్. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో హీరోయిన్‌గానే నటించి మెప్పించిన శ్రుతి… ఈ సారి కీలక పాత్రలోనూ అలరిస్తుందేమో చూడాలి. త్వరలోనే శ్రుతి ఎంట్రీపై క్లారిటీ రావచ్చు.
[youtube_video videoid=6r2ewtrtq8Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: