ఎప్పటిలాగే ఈ ఏడాదిలో కూడా వేసవి బరిలో ఆసక్తికరమైన సినిమాలు సందడి చేయనున్నాయి. మార్చి ద్వితీయార్ధంతో మొదలై జూన్ ప్రథమార్ధంతో ముగిసే ఈ సీజన్‌లో… దాదాపు ప్రతీ వారం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 5న యువ సామ్రాట్ నాగచైతన్య, సమంత జంటగా నటించిన `మజిలీ` విడుదల కానుండగా… 12న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నటిస్తున్న `చిత్ర లహరి` తెరపైకి రానుంది. ఇక అదే నెల 19న నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `జెర్సీ` భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తరువాత రెండు వారాలకు సంబంధించిన విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మే 9న ఈ వేసవికే ప్రధాన ఆకర్షణగా నిలువనున్న `మహర్షి` రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ చిత్రం కావడంతో… ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక మే 22న యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న `డియర్ కామ్రేడ్` రిలీజ్ కానుంది. `గీత గోవిందం` తరువాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మే చివరి వారంలో యంగ్ హీరో శర్వానంద్, కాజల్, కళ్యాణి నటిస్తున్న పేరు నిర్ణయించని సుధీర్ వర్మ చిత్రం విడుదల కానుంది. మే 31న ఈ సినిమా తెరపైకి రానుందని టాక్. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న `ఇస్మార్ట్ శంకర్` కూడా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి… ఈ క్రేజీ ప్రాజెక్ట్సలో ఏ చిత్రానికి ప్రజాదరణ దక్కుతుందో తెలియాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: