రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏయే అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తరువాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభమప్పుడే చెప్పడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. ఓ రకంగా క్రిష్ తీసిన బయోపిక్ కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో..దానికి తగినట్టే వర్మ కూడా వెన్నుపోటు, ఎందుకు, రీసెంట్ గా అవసరం అంటూ ఈ సినిమాలోని పాటలను ఒక్కటిగా వదులుతూ ఝలక్ లు ఇస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశాడు.
కాగా ఇక ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తుండగా.. కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేం శ్రీతేజ్ కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ నటిస్తున్నాడు. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కానుంది.
[youtube_video videoid=DUu1gScXol4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: