యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌ని కీలక మలుపు తిప్పిన చిత్రం `అర్జున్ రెడ్డి` (2017). ఆ సినిమాతోనే తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది షాలినీ పాండే. అర్జున్ రెడ్డి, ప్రీతి పాత్రల్లో విజయ్, షాలిని జంట యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. మళ్ళీ రెండేళ్ళ తరువాత ఈ జోడీ మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బైక్ రేసర్‌గా విజయ్ కనిపించనున్నాడు. అంతేకాదు… ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనున్నాడట. కాగా… ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా కేరళకుట్టి మాళవికా మోహనన్ ఎంపిక కాగా… మెయిన్ హీరోయిన్ రోల్ కోసం షాలినీ పాండే ఎంపికయ్యిందని టాక్. త్వరలోనే షాలిని ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి… `అర్జున్ రెడ్డి` పెయిర్ సెల్యులాయిడ్‌పై మరోసారి మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=y_7VRMwdOI8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: