రామ్ గోపాల్ వర్మ సినిమా ‘దెయ్యం’ నుండి ప్రస్తుతం వస్తున్న హార్రర్ సినిమాల వరకూ మనం ఎన్నో హార్రర్ మూవీస్ చూసి ఉంటాం. ఈనేపథ్యంలో హార్రర్ సినిమాలు అంటే మన మైండ్ లో కొన్ని ఎలిమెంట్స్ ఫిక్స్ అయి పోయి ఉంటాయి. ఒక ఇల్లు, అందులో దెయ్యం.. ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్లని ఆ దెయ్యం ఆడుకోవడం.. లేక వాళ్లకి దెయ్యం ఆవహించటం.. మ్యాగ్జిమమ్ ఇవే ఉంటాయి. ఇక ఇదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములాను అటు తిప్పి ఇటు తిప్పి హార్రర్ సినిమా అని తీసి బొక్క బోర్లా పడుతున్నారు కొంతమంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ ఫార్ములాను దాటి కాస్త బయటకు వచ్చి వైవిద్యం చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలా ప్రయత్నించిన సినిమానే రీసెంట్ గా రిలీజైన జెస్సీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎక్కువ పబ్లిసిటీ లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హార్రర్ కి సస్పెన్స్ జోడించి తీసిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. నార్మల్ హార్రర్ సినిమాలా మొదలైనా ఇంటర్వెల్ వచ్చేసరికి అసలైన ట్విస్ట్ తో ఆసక్తిగా మారుతుంది. ఆ ట్విస్టు తప్పకుండా అందరినీ థ్రిల్‌కి గురి చేస్తుంది. హార్రర్ సినిమాల్లో దెయ్యం సంగతి పక్కన పెడితే అరుపులు, సౌండ్ ఎఫెక్ట్ లతోనే భయాన్ని కలిగిస్తారు. ఈ సినిమాలో కూడా దెయ్యాన్ని చూపించి భయపెట్టడం కంటే… శబ్దాలతో, అరుపులతో వణుకు తెప్పించాడు డైరెక్టర్. ఇప్పుడు దెయ్యాన్ని చూస్తామా? ఎటు నుంచి వస్తుందో ఏమో.. అనే భయమే కథని నడిపిస్తుంది. మంచం కింద దెయ్యాన్ని చూపించిన సీన్… నిజంగా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి చాలా ఎలిమెంట్స్ సినిమాలో ఉండటంతో జెస్సీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చాలా బావుందని… రివ్యూలను.. విమర్శలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చని పలు సోషల్ మీడియా వేదిక ద్వారా తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
[youtube_video videoid=pYtzXOu8Ef0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: