పులిజూదం తెలుగు మూవీ రివ్యూ

#PuliJoodhamReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Puli Joodham Movie Plus Points, Puli Joodham Movie Public Response, Puli Joodham Movie Public Talk, Puli Joodham Movie Review, Puli Joodham Movie Review and Rating, Puli Joodham Review, Puli Joodham Telugu Movie Review, Puli Joodham Telugu Movie Story, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Puli Joodham Telugu Movie Review

ఇతర భాషల్లోని సినిమాలు తెలుగులో రిలీజై సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ నమ్మకంతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పులి జూదం. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక అందరూ పెద్ద స్టార్లే ఉండటంతో సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను ఎంత వరకూ నచ్చిందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : మోహన్ లాల్, యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా త‌దిత‌రులు.
దర్శకత్వం : ఉన్నికృష్ణన్‌
నిర్మాత : రాక్ లైన్ వెంకటేశ్
సంగీతం : సుషిన్ శ్యామ్
స్క్రీన్ ప్లే : ఉన్నికృష్ణన్‌

కథ:

టాస్క్ ఫోర్స్ ఏడీజీపీగా మాథ్యూ (మోహన్ లాల్) బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. క్రైమ్ జరిగిన ప్లేస్ ను చూసి.. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగే టాలెంటెడ్ పర్సన్. అయితే కొన్ని సంఘటనల వల్ల మాథ్యూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటాడు. కానీ అదే సమయంలో మూడు హత్యలు జరుగుతాయి. హత్యకు గురైనవారంతా ప్రముఖ వ్యక్తులే. అవి ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో తెలీదు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవు. దీంతో ఆ హత్యలు చేసిన వారిని పట్టుకోవడానికి మాథ్యూ నే రిక్వెస్ట్ చేస్తారు అధికారులు. దాంతో తన లీవ్ పక్కన పెట్టి మాథ్యూ ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? వారిని మాథ్యూ ఎలా కనిపెట్టాడు? దువ్వూరి మదనగోపాల్ (విశాల్)కి ఆ హత్యలకు ఉన్న సంబధం ఏమిటి ? మాథ్యూ జీవితంలో జరిగిన అనుకోని సంఘటన ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:

రెండేళ్ల క్రితం అంటే 2017లో కేరళలో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా. తెలుగులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు, విశాల్ కు కూడా మంచి ఫ్యాన్స్ ఉండటంతో ఇక్కడ కూడా సినిమా రిలీజ్ చేశారని చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికొస్తే ఎప్పటిలాగే మోహన్ లాల్ మాథ్యూ పాత్రలో తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా తన భార్య నీలమ చనిపొయే సన్నివేశంలో మరియు విశాల్ తో సాగే క్లైమాక్స్ లో అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో కూడా ఆయన తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. వయసు మీదపడినా ఫైట్లు బాగానే చేశారు. ఇక డాక్టర్ పాత్రలో విశాల్ నటన కూడా చాలా బాగుంది.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్‌ డ్రగ్ కింగ్‌గా నెగిటివ్ పాత్రలో తన నటనతో మెప్పిస్తాడు. ఇక హన్సిక, రాశీ ఖన్నా, మంజు వారియర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.

దర్శకుడు ఉన్నికృష్ణన్‌ సినిమాలో చెప్పాలనుకున్న ‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో ఒక హీరో ఉంటాడు’ అనే స్టోరీ థీమ్ బాగుంది. అలాగే దర్శకుడు సినిమా ముగింపులో కూడా చక్కని దర్శకత్వ పనితనం కనబర్చాడు. ‘ఒక మనిషిని మరొక మనిషి చంపడం వంటి అసాధారణ చర్య మరొకటి ఉండదు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో వరుస హత్యలు ఎలా జరిగాయో చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఆ హత్యలు ఎందుకు చేశారు, హంతకులను మాథ్యూ ఎలా పట్టుకున్నారు వంటి విషయాలను చాలా బాగా చూపించాడు.

సాంకేతికంగా సినిమా బాగుందనే చెప్పాలి. మనోజ్ పరమహంస, ఎన్.కె.ఏకాంబరం అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు సుషిన్ శ్యామ్ అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం ఆ నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకున్నేలా ఉంది. రాక్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే తెలుగు నేటివిటీ లేకపోవడంతో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పలేం. కానీ..క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

 

పులిజూదం తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=vm9dLvsbAhk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 9 =