‘పీఎస్వీ గరుడవేగ, 24కిస్సెస్’ వంటి విభిన్న చిత్రాలలో నటించిన హీరో ఆదిత్ అరుణ్ సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. టైటిల్ తోనే యూత్ ను తమ వైపుకు తిప్పుకున్న ఈ సినిమా..ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు : అదిత్ , హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ మోతే
దర్శకత్వం : సంతోష్ పి.జయకృష్ణ
సంగీతం : బాల మురళి
ఎడిటర్ : ప్రసన్న జి.కె.
కథ:
చందు (ఆదిత్), శివ (హేమంత్) ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే ఒకరోజు చందు పెళ్లి చూపుల కోసం పూజా(నిక్కి తంబోలి) అనే అమ్మాయిని చూడటానికి వాళ్ల ఇంటికి వెళతాడు. అక్కడ పెళ్లి కూతురు వాళ్ల నాన్న ఓ కండీషన్ మీద అమ్మాయిని ఏదైనా ట్రిప్ కు తీసుకెళ్లి.. పరిచయం ఏర్పరుచుకోమని చెబుతాడు. చందు కూడా దీనికి ఒప్పుకొని పూజాను ట్రిప్ కు తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. తనతో పాటు ఫ్రెండ్ శివను కూాడా రమ్మంటాడు. దీంతో శివ కూడా తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొని వెళతాడు. అలా నలుగురు బ్యాంకాంక్ వెళ్లి ఓ ఇంట్లో ఉంటారు. అయితే ఆ ఇంట్లో వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆ క్రమంలో ఇంట్లో దెయ్యం ఉందని తెలుసుకుంటారు. ఆ దెయ్యం అమ్మాయిలను ఏం చేయదు కానీ అబ్బాయిలను వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? దాని స్టోరీ ఏంటి ? అబ్బాయిలనే ఆ దెయ్యం ఎందుకు వేధిస్తుంది? దెయ్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు…? ఆ దెయ్యం నుండి ఈ రెండు జంటలు ఎలా తప్పించుకుంటాయి..? అనేదే సినిమా.
విశ్లేషణ:
నిజానికి హార్రర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ కు గురిచేసి.. కథలో పట్టుంటే చాలు సినిమా హిట్టయినట్టే. ఇక ఈసినిమా విషయానికి వస్తే.. సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తాగుబోతు రమేష్ దెయ్యం వున్నా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాక అక్కడ నుండి సినిమా హిలేరియస్ గా ఉంటుంది. అంతేకాదు ఫిజికల్ గా మాత్రం అసభ్యకరంగా ఏమి లేకపోవడం కూడా సినిమా కు ప్లస్సే. హీరో అరుణ్ ఆదిత్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. నేటి యువత ఆ పాత్రకు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇప్పటి జెనరేషన్ యూత్ ప్రేమ విషయంలో ఎలా ఉంటున్నారనే విషయాలు బాగా చూపించారు. హేమంత్ , నిక్కీ తంబోలి ,భాగ్య శ్రీ ల నటన కూడా బాగుంది.
నిజానికి డైరెక్టర్ కథపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఇంకా బావుండేది. ఎక్కువ డబల్ మీనింగ్ డైలాగ్స్ పై కాన్సన్ట్రేట్ చేయడం సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపించింది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లో బడ్జెట్ చిత్రమైన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీస్ చూసే సినిమా కాదని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చూడొచ్చు. యూత్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతుంది.
[wp-review id=”17471″]
[youtube_video videoid=E0GPRN52SQQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: