‘విలన్’ పాత్రలపై ఇంట్రెస్ట్ చూపుతున్న హీరోలు

Tollywood Star Show Interest Towards Negative Roles,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Stars in Negative Roles,Telugu Heroes Turns Villain Characters,Tollywood Heroes in Negative Roles,Negative Roles in Tollywood Top Heroes
Tollywood Star Show Interest Towards Negative Roles

విలన్ ‘హీరో’ అయ్యాడు… విలన్ హీరో అవ్వడం ఏంటబ్బా అనుకుంటున్నారా..? ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న చిన్నగా నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఇన్ని రోజులు హీరోలుగా హీరోయిజం చూపించి.. చూపించి మన హీరోలకు బోర్ కొట్టిందేమో తెలియదు కానీ విలన్ పాత్రలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న థోరణికి స్వస్తి పలికి.. నేటి విలన్లు కూడా హీరోల్లాగా మేకోవర్ అవుతున్నారు. కొన్ని కొన్ని సినిమాల్లో అయితే హీరోల కంటే విలన్లే ఎక్కువ హ్యాండ్ సమ్ గా ఉంటున్నారు. దీనిలో భాగంగా తమలో ఉన్న నెగిటివ్ యాంగిల్ ను కూడా చూపించుకోవడానికి మంచి అవకాశం ఉండటంతో హీరో లు కూాడా విలన్లుగా మారుతున్నారు. ఒకపక్క హీరో లుగా సినిమాలు చేస్తూనే.. విలన్ గా తమ విలనిజాన్ని చూపించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇది ఇప్పటి ట్రెండ్ ఏం కాదు. గతంలో విలన్లు గా చేసి సూపర్ స్టార్లు అయిన వాళ్లు మన ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సినిమాల్లో విలన్ క్యారెక్టర్ వేసినవాడే. ఇంకా రజినీ కాంత్, మోహన్ బాబు, శ్రీకాంత్, శ్రీహరి ఇలా చాలా మంది విలన్ పాత్రలు చేసి.. ఆతరువాత హీరోలుగా.. సూపర్ స్టార్లుగా మారారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మొదట హీరోలుగా చేసిన మన హీరోలు… ఇప్పుడు విలన్ పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

జగపతిబాబు

నిజానికి జగపతిబాబు హీరో గా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ… తన సెకండ్ ఇన్నింగ్ లో విలన్ గా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుండి ఫేట్ మారిపోయిందని చెప్పొచ్చు. స్టైలిష్ విలన్ గా.. మాస్ విలన్ గా ఇలా ప్రస్తుతం మంచి ఫామ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఆది పినిశెట్టి

సరైనోడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు ఆది పినిశెట్టి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నే మించి పోయే హ్యాండ్ సమ్ నెస్ తో విలన్ అంటే ఇలా కూడా ఉండొచ్చా అనేలా నటించాడు ఆది ఆ సినిమాలో. ఓ రకంగా ఇప్పుడున్న హీరోలు విలన్లు గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించడంలో ఆది ఎఫెక్ట్ కొంతైనా ఉండొచ్చని చెప్పొచ్చు.

ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఎన్టీఆర్. నిజానికి హాయిగా హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవచ్చు ఎన్టీఆర్. కానీ ఒకే మూసలో వెళ్లకుండా తాను కూడా విలన్ గా ట్రై చేసి మంచి మార్కులు కొట్టేశాడు. జై లవ కుశ సినిమాలో.. త్రిపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్లలో విలన్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కే మంచి పేరొచ్చిందంటేనే చెప్పొచ్చు ఎన్టీఆర్ ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయాడో.

రానా

ఇక రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక భాష అని కాదు.. ఒక క్యారెక్టర్ అని కాదు.. దేనిలో అయినా పరాకాయ ప్రవేశం చేసి తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేస్తాడు రానా. బాహుబలి లాంటి సినిమాలో భల్లాలదేవుడు లాంటి విలన్ లేకపోతే బాహుబలికి అంత గుర్తింపువచ్చి ఉండేది కాదేమో అన్నట్టు చేశాడు ఆ సినిమాలో. హీరోగా, విలన్ గా ఏ క్యారెక్టర్ చేసినా వంద శాతం ఆ పాత్రకి న్యాయం చేసే నటుడు రానా.

వరుణ్ తేజ్

వరుస హిట్లతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ హీరో కూడా విలన్ పాత్రపై మోజు పడినట్టు ఉన్నాడు. అందుకే తన కొత్త సినిమాలో నెగిటివ్ షేడ్ లో ఉన్న పాత్రనే సెలక్ట్ చేసుకున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మికి సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

నాని

నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని ఇప్పటికే జెంటిల్ మెన్ సినిమాలో నెగిటివ్ షెడ్స్ ఉన్నపాత్రలో నటించాడు. హీరోగా ఎంత నేచురల్ గా నటిస్తాడో.. నెగిటివ్ షేడ్ లో కూాడా అలానే నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు తాజాగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తోన్న సినిమాలో నాని విలన్ గా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. సినిమా మొత్తం కూడా నాని విలన్ గానే కనిపిస్తాడట.

వీరే కాదు అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, నవదీప్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అలా మన హీరోలు విలన్లు గా కూడా ప్రయోగం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందాలని చూస్తున్నారు. మరి పైన టైటిల్ లో చెప్పినట్టు హీరో విలన్ అవ్వడం కాదు.. విలనే ‘హీరో’ అయ్యాడని చెప్పొచ్చు కదా..కేవలం హీరోలే కాదు హీరోయిన్స్ కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాాత్రలు చేయడానికి రెడీ అవుతున్నారు. దీన్నిబట్టి చూస్తే విలన్లకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది కదా..

[subscribe]

[youtube_video videoid=pYtzXOu8Ef0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 3 =