
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 47

'ఫస్ట్ ర్యాంక్ రాజు' ట్రైలర్ రిలీజ్
ఈసారి హిందీలో కూడా

వెబ్ సిరీస్ రంగంలోకి క్రిష్ కూడా..!
కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టిన యాంకర్ రవి

రెండు పార్శ్వాలున్న పాత్రలో జాన్వీ కపూర్
మన్మథుడు 2 - రకుల్ కోసం స్పెషల్ టీజర్

మొదలైన రానా, సాయిపల్లవి 'విరాటపర్వం'
షూటింగ్ లో నాగశౌర్య కు ప్రమాదం

వారితో పనిచేయడం ఓ కలలా ఉంది
సౌత్ మొత్తం మీద కన్నేసిన అర్జున్ రెడ్డి
కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న వెంకీమామ
'ఎన్జీకే' క్లోజింగ్ కలెక్షన్స్

24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు
క‌్రేజీ ప్రాజెక్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్?

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
అనుష్క 'నిశ్శబ్దం'... 25% షూటింగ్ పూర్తి

పాతబస్తీలో ‘డిస్కో రాజా’ సందడి
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కో రాజా’. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ బాణీలు అందిస్తున్నాడు.
'ఫస్ట్ ర్యాంక్ రాజు' ట్రైలర్ రిలీజ్
కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాతృక డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రీలిజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈసారి హిందీలో కూడా
వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్ మరియు టెర్రనోవా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల రిలీజై డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నైజాంలో మాత్రం ఈసినిమా మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఫలక్ నుమా దాస్ సీక్వెల్ ఫలక్ నుమా దాస్ 2 కూడా తీయనున్నట్టు విశ్వక్ సేన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు.

వెబ్ సిరీస్ రంగంలోకి క్రిష్ కూడా..!
ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా నడుస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా.. నెల, రెండు నెలల్లో ఏదో ఒక యాప్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా కంటే వెబ్ సిరీస్ లకు మంచి బిజినెస్ నడుస్తుందని చెప్పొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వెబ్ సిరీస్ లపైనే దృష్టి పెడుతున్నారు. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సొంత ప్రొడక్షన్ ద్వారా వెబ్ సిరీస్ లు తీయాలని చూస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ రిలీజ్ ఆరోజేనా?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా... అది కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు చేస్తుండటంతో 'ఆర్ఆర్ఆర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు... ఇంకా సినిమా నిర్మాణం కూడా పూర్తి కాకముందే ఈ సినిమా ఓవర్‌సీస్ రైట్స్ భారీగా అమ్ముడుపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు 2019... కేరాఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్
ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రతీ వారం ఆసక్తికరమైన సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే...
కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టిన యాంకర్ రవి
ఎన్నో కోట్ల మంది టీవీలు చూస్తున్నప్పుడు యాంకర్లుగా వ్యవహించేవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. అయితే అప్పుడప్పుడు వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే యాంకర్ రవికి వచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా రవి పలు షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన చలాకీ మాటలతో నవ్వు తెప్పిస్తుంటాడు. అయితే ఇటీవల తాను చేసే ఓ ప్రోగ్రాంలో ఓ కంటెస్టెంట్ ఏపీ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అక్కడే అసలు సమస్య వచ్చిపడింది.

రెండు పార్శ్వాలున్న పాత్రలో జాన్వీ కపూర్
అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా హిందీ చిత్రం ‘ధడక్’తో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న జాన్వి... ప్రస్తుతం ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘కార్గిల్ గర్ల్’లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో... తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించింది జాన్వి.
మన్మథుడు 2 - రకుల్ కోసం స్పెషల్ టీజర్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగ్ రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మొదలైన రానా, సాయిపల్లవి 'విరాటపర్వం'
‘నీది నాది ఒకే కథ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఇప్పుడు వేణు దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా ఈ మూవీని దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు.
షూటింగ్ లో నాగశౌర్య కు ప్రమాదం
టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోలు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో రిస్కీ షాట్స్ చేయడంతో గాయాలపాలవుతున్నారు. RRR మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, చాణక్య మూవీ లో గోపిచంద్, గ్యాంగ్ లీడర్ లో నాని, వాల్మీకి లో వరుణ్ తేజ్ కు గాయాలయ్యాయి. ఇప్పుడు నాగశౌర్య కు ప్రమాదం జరిగింది.తమ అభిమాన హీరోలకు షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడంతో అభిమానులు ఆందోళనపడుతున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

వారితో పనిచేయడం ఓ కలలా ఉంది
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సాహో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి నిన్న టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా ఏముంది. 60 మిలియన్స్ గా పైగా డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతుంది. నెం.1 ట్రెండింగ్ లో నిలిచింది. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది టీజర్ ను చూసి ప్రశంసలు కురిపించారు.

డిసప్పాయింట్ చెయ్యని కామెడీ ఎంటర్టైనర్ వజ్ర కవచ ధర గోవిందా
అలాగే మ్యూజిక్, కెమెరా, డైలాగ్స్, ఫైట్స్, ఎడిటింగ్ వంటి టెక్నికల్ యాస్పెక్ట్స్ లో కూడా సంతృప్తికరమైన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ ను అభినందించాలి. అవసరమైన మేరకు ఖర్చు చేసి మేకింగ్ పరంగా, పబ్లిసిటీ పరంగా ఎలాంటి లోపమూ లేకుండా సినిమాను రిలీజ్ చేయటం అభినందనీయం.
సౌత్ మొత్తం మీద కన్నేసిన అర్జున్ రెడ్డి
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన యంగ్ హీరో ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరు గుర్తొస్తుంది. 'లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్' అనే సినిమాలో అసలు ఉన్నాడా లేదా అన్న చిన్న క్యారెక్టర్ లో నటించిన విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' లాంటి చిన్న సినిమాతో హిరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమా 'అర్జున్ రెడ్డి' గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేయడమే కాదు.. విజయ్ లో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. ఆ తరువాత వచ్చిన 'గీతా గోవిందం', 'టాక్సీవాలా' సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో విజయ్ రేంజే…
కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న వెంకీమామ
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనిలోభాగంగానే గత కొంతకాలంగా ఈ టీమ్ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక నిన్నటితో కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది చిత్రయూనిట్. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ చాలా వరకూ పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది.
'ఎన్జీకే' క్లోజింగ్ కలెక్షన్స్
సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఎన్జీకే’ సినిమా మే31వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాగా.. ఇక్కడ మాత్రం కాస్త నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఈ సినిమా 4.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రన్ టైమ్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఏ యే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం..

24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు
సినిమా ప్రారంభమైన దగ్గర నుండి రిలీజ్ వరకూ సినిమాల అప్ డేట్ లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు హీరోలు, హీరోయిన్ లు, దర్శక నిర్మాతలు. ఇక తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వచ్చిందంటే చాలు క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్ కూడా. వారి సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తుంటారో వ్యూస్ ను బట్టి చెప్పొచ్చు. అందుకే సినిమా టీజరో, ట్రైలరో రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఒకప్పుడు 1 మిలియన్స్ వస్తే అదో రికార్డ్.. అవన్నీ పోయాయి.. బాహుబలి తో తుడుచుకుపోయి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి రికార్డులు కూడా తుడుచుకుపోయి సరికొత్త…
క‌్రేజీ ప్రాజెక్ట్‌లో రకుల్ ప్రీత్ సింగ్?
తెలుగు, తమిళ్, హిందీ... ఇలా మూడు భాషల్లోనూ కథానాయికగా రాణిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే `దే దే ప్యార్ దే`, `ఎన్జీకే` చిత్రాలతో పలకరించిన రకుల్... ప్రస్తుతం `మన్మథుడు 2`లో కింగ్ నాగార్జునకి జోడీగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రజనీకాంత్ 'దర్బార్' అప్‌డేట్
వరుస సినిమాలతో సందడి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్... ప్రస్తుతం `దర్బార్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ ప్రతినాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు.
అనుష్క 'నిశ్శబ్దం'... 25% షూటింగ్ పూర్తి
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయిక అనుష్క. `అరుంధతి`, `భాగమతి`తో ఘనవిజయాలను అందుకున్న స్వీటీ... ఇప్పుడు మరో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తోంది. అదే `నిశ్శబ్దం`. బహు భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఇతర భాషల్లో `సైలెన్స్` పేరుతో రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం... ఇటీవలే అమెరికాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. కాగా, అప్పుడే 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఈ విషయాన్ని దర్శకుడు హేమంత్... తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశాడు.