ఎన్నో కోట్ల మంది టీవీలు చూస్తున్నప్పుడు యాంకర్లుగా వ్యవహించేవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. అయితే అప్పుడప్పుడు వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే యాంకర్ రవికి వచ్చింది. బుల్లితెరపై యాంకర్ గా రవి పలు షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన చలాకీ మాటలతో నవ్వు తెప్పిస్తుంటాడు. అయితే ఇటీవల తాను చేసే ఓ ప్రోగ్రాంలో ఓ కంటెస్టెంట్ ఏపీ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అక్కడే అసలు సమస్య వచ్చిపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ కంటెస్టెంట్ మాట్లాడుతుంటే రవి సోపర్ట్ చేశాడంటూ…రవి పై సోషలో మీడియాలో నెటిజన్లు దాడికి దిగారు. ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా యాంకర్ రవి పర్సనల్ అసిస్టెంట్ ఫోన్‌కు కూడా కాల్ చేసి తిట్ల దండకం అందుకుంటున్నారట. దీంతో రవినే రంగంలోకి దిగి అదే సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆరోజు జరిగింది తప్పే.. దానికి ఆ అబ్బాయి సారీ కూడా చెప్పాడు.. అయితే ఈ ఇష్యూలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు.. నాకు సంబంధం ఏముంది.. ఒక యాంకర్ గా ఎవరు ఏం చేసినా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంటుంది.. నాకు రెండు తెలుగు రాష్ట్రాలన్నా.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలన్నా గౌరవం ఉంది.. ఈ ఇష్యూని ఇక్కడితో ఆపాలని కోరాడు. మరి నెటిజన్లు ఇప్పటికైనా స్పీడు తగ్గిస్తారేమో చూద్దాం..
I love my India, I love my 2 Telugu states!
Dont find my mistake…try understanding! pic.twitter.com/GgEsA0e2xS— Anchor Ravi (@anchorravi_offl) June 15, 2019
[youtube_video videoid=rDoFiOjoC2Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: