మన్మథుడు 2 – రకుల్ కోసం స్పెషల్ టీజర్

Manmadhudu 2 Team Planning A Special Teaser For Rakul Preet?,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Special Teaser,Manmadhudu 2 Movie Shooting News,Manmadhudu 2 Team Special Gift For Rakul Preet
Manmadhudu 2 Team Planning A Special Teaser For Rakul Preet?

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగ్ రోల్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఆయనకి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ టీజర్ లో గమనిస్తే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న రకుల్ ఎక్కడా కనిపించదు. దీనిపై పలువురికి అనుమాానాలు కూడా తలెత్తాయి. దాంతో రకుల్ పాత్రకి సంబంధించిన సన్నివేశాలపై ప్రత్యేకంగా మరో టీజర్ ను వదులుతామనీ, అందువల్లనే తాజాగా రిలీజ్ చేసిన టీజర్లో రకుల్ ను చూపించలేదని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశాడు. మొత్తానికి రకుల్ కోసం స్పెషల్ గా టీజర్ కట్ చేయడం గ్రేటే.

కాగా ఈ సినిమాలో నాగార్జున సరసన కేవలం రకుల్ సింగ్ ప్రీత్ మాత్రమే కథానాయికగా నటిస్తుంది. సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.

[subscribe]

[youtube_video videoid=TLWmy4u_qYY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 12 =