సౌత్ మొత్తం మీద కన్నేసిన అర్జున్ రెడ్డి

Rowdy Vijay Deverakonda Targets Whole South India,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Upcoming Film News,Interesting News About Vijay Deverakonda
Rowdy Vijay Deverakonda Targets Whole South India

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన యంగ్ హీరో ఎవరంటే వెంటనే విజయ్ దేవరకొండ పేరు గుర్తొస్తుంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ అనే సినిమాలో అసలు ఉన్నాడా లేదా అన్న చిన్న క్యారెక్టర్ లో నటించిన విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ లాంటి చిన్న సినిమాతో హిరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమా ‘అర్జున్ రెడ్డి’ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేయడమే కాదు.. విజయ్ లో ఉన్న టాలెంట్ ను బయటపెట్టింది. ఆ తరువాత వచ్చిన ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో విజయ్ రేంజే మారింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూపించే రేంజ్ కు ఎదిగాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత లాగ… క్రేజ్ ఉన్నప్పుడే దానిని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు విజయ్. అందుకే కేవలం తెలుగులోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అందుకే ఇప్పటివరకూ ఉన్న సీనియర్ హీరోలు సైతం చేయని విధంగా పలు భాషల్లో ఒకేసారి తన సినిమాలు రిలీజ్ చేయడానికి ధైర్యం చేస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజులకే తమిళ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘నోటా’ అనే ద్విభాషా చిత్రాన్ని చేశాడు. అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదనుకోండి. ఇక ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

ఇప్పుడు ‘హీరో’ సినిమా కూడా తెలుగు, తమిళ్ లో చేయనున్నాడు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాతో మరోసారి ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. నోటా పోవడంతో.. ఈ సినిమాతో సక్సెస్ అందుకుని తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనేది విజయ్ ప్లాన్. డియర్ కామ్రేడ్ తో ఎలాగూ కన్నడ, మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం మీద కన్నేసినట్టున్నాడు. అంతేకాదు ప్లానింగ్ కూడా బాగానే ఉన్నట్టు ఉంది. అందుకే కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా..అన్ని ఏరియాల్లో పాగా వేయాలని చూస్తున్నాడు. మరి చూద్దాం.. విజయ్ లక్ ఎలా ఉందో తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అవ్వాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=C4ofndzFciI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here