ఏ సినిమా చూడటానికి ప్రేక్షకుడు సిద్ధపడి వస్తాడో ఆ సినిమాను అతని అంచనాల మేరకు తీయగలిగితే ఆ దర్శకుడు సక్సస్ అయినట్లే…జోనర్ ను బట్టి అందులోని ప్రధాన నటీనట సాంకేతిక వర్గాన్ని బట్టి ప్రేక్షకుడు కొన్ని అంచనాలు ఏర్పరుచుకుంటాడు. కానీ తెరమీద తన అంచనాలకు భిన్నమైన సినిమా కనిపిస్తే మాత్రం ప్రేక్షకుడి కోపం నషాలానికి అంటుంది. సోషియో ఫాంటసీ యాక్షన్ త్రిల్లర్ అనుకుని వెళ్ళితే ఏదో కామెడీ ఎంటర్టైనర్ చూపిస్తే చిరాకు పడతాడు ప్రేక్షకుడు . అలా కాకుండా కామెడీ ఎంటర్టైనర్ చూడబోతున్నాను అనే ప్రీ ఆక్యుపైడ్ ప్రిపరేషన్ తో వచ్చినప్పుడు ఆ సినిమా అంత గొప్పగా లేకపోయినా ఎంజాయ్ చేస్తాడు ప్రేక్షకుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కమెడియన్ టర్నెడ్ హీరో సప్తగిరి హీరోగా నటించిన ” వజ్ర కవచ ధర గోవిందా” చిత్రాన్ని రివ్యూ చేద్దాం. గతంలో సప్తగిరి హీరో గా “సప్తగిరి ఎక్స్ప్రెస్ ” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన ” వజ్ర కవచ ధర గోవిందా”
ఎలా ఉందో చూద్దాం.
గోవింద్ (సప్తగిరి) క్యాన్సర్ బారిన పడిన తన ఊరి ప్రజలను రక్షించుకోవడం కోసం ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న తన చిన్నప్పటి క్లాస్మేట్
(అర్చన) కు సపోర్ట్ చేసి ఆమెను గెలిపిస్తాడు.తీరా ఎన్నికల్లో గెలిచాక ఆమె గోవిందును వూరి జనాన్ని మోసం చేస్తుంది. ఊరి జనానికి క్యాన్సర్ వైద్యం చేయించడానికి, ఊర్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడానికి సహాయం చేస్తానన్న ఎమ్మెల్యే మోసం చేయడంతో ఎలాగైనా అందుకు అవసరమైన డబ్బు సంపాదించి ఊరిని కాపాడాలనే లక్ష్యంతో గోవిందు దొంగగా మారుతాడు. అలాంటి సమయంలో పొరుగూరి దేవాలయంలో 200 కోట్ల విలువ చేసే వజ్రాల నిధి ఉంది..
ఆ నిధిని బయటకు తేవటంలో సహాయం చేస్తే తన లక్ష్యానికి అవసరమైన పది కోట్ల రూపాయలు వస్తాయని చెబుతారు అందుకు ప్రయత్నిస్తున్న ఒక ముఠా.ఆ ముఠాతో చేతులు కలిపి దొంగ బాబా అవతారమెత్తి మొత్తానికి ఆ వజ్రాన్ని సంపాదిస్తారు. తీరా దాన్ని అమ్మేసి వాటాలు పంచుకుందాం అనుకునే సమయానికి ఆ ఏరియా ఫ్యాక్షనిస్ట్ బంగారప్ప మనుషులు అడ్డుకుంటారు. అయితే ఆ వజ్రాన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచిన గోవిందుకు ఒక చెట్టు ఆకులు తినటం వల్ల మెమరీ లాస్ ఏర్పడి గతాన్ని మరిచిపోతాడు. తిరిగి అతనికి జ్ఞాపక శక్తి తెప్పించటానికి బంగారప్ప మనుషులు చేసిన ప్రయత్నాలు ఏమిటి? చివరికి ఆ వజ్రం దొరికిందా? ఊరికి మంచి చేయాలన్న గోవిందు లక్ష్యం నెరవేరిందా? వంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది ద్వితీయార్థం. ఇదీ టూకీగా ” వజ్రకవచధర గోవిందా” కథాకమామిషు.
విశ్లేషణ :
ఈ కథను సప్తగిరికి ఉన్న కామెడీ హీరో ఇమేజ్ కి తగినట్లుగా మలచటానికి దర్శకుడు అరుణ్ పవార్ చేసిన ప్రయత్నం చాలావరకు ఫలించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సప్తగిరి నుండి ఇతర ఆర్టిస్టుల నుండి మంచి యాక్టింగ్ ఎంటర్టైన్మెంట్ ను రాబట్టగలిగాడు దర్శకుడు. కామెడీ పంచ్ లతో, మంచి యన్టర్టైనింగ్ సీన్స్ తో ఫస్టాఫ్ ను చాలా ఫాస్ట్ గా నడిపించాడు అరుణ్ పవార్. ఇక ద్వితీయార్థం మొత్తం గతాన్ని మరచి పోయిన గోవిందుకు గతాన్ని గుర్తుకు తీసుకురావటానికి చేసే ప్రయత్నాలతో హాస్యాన్ని పండించాలని ప్రయత్నించాడు దర్శకుడు. కానీ ఆ ప్రాసెస్ కొంచెం సాగతీతగా సాగింది.
ఫస్టాఫ్ సాగినంత ఫాస్ట్ గా సెకండ్ హాఫ్ సాగకపోవడం, సన్నివేశాలు ఆశించినంత గ్రిప్పింగ్ గా లేకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపం. అయితే మొత్తం మీద సప్తగిరి ఇమేజ్ లిమిట్స్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కామెడీ ఎంటర్టైనర్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం బాగానే ఉంది. లాజిక్కులు, రీజనింగ్ లు వెతికి పట్టుకోకుండా సినిమాటిక్ ఎక్స్యూజ్ ను యాక్సెప్ట్ చేయగలిగితే” వజ్రకవచధర గోవిందా” ను వన్ టైం ఎంటర్టైనర్గా ఎంజాయ్ చేయవచ్చు(మధ్యమధ్యలో కొన్ని పంటికింద రాళ్ళ వంటి సన్నివేశాలను మినహాయిస్తే…)
పర్ఫార్మెన్స్:
హాస్యనటుల్లో, కామెడీ హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అలాగే సప్తగిరికి కూడా ప్రేక్షకులకు నచ్చిన తనదైన ప్రత్యేక తరహా డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ఉన్నాయి. హీరోగా చేస్తున్నంత మాత్రాన తన కామెడీ మార్క్ ను, లిమిటేషన్స్ ను వదిలేసి నేల విడిచి సాము చేయకుండా లిమిటేషన్స్ లోనే మంచి కామెడీ మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి ప్రయత్నించాడు. ఇక ఈ సినిమా మొత్తం సప్తగిరి పోషించిన గోవిందు పాత్ర చుట్టూ పరిభ్రమించడంతో పర్ఫార్మెన్స్ పరంగా సినిమా మొత్తాన్ని అతనే ఎక్కువగా షోల్డర్ చేయవలసి వచ్చింది. మిగిలిన అన్ని పాత్రలలో అందరు నటులు పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ముఖ్యంగా జబర్దస్త్ బ్యాచ్ ప్యాడింగ్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.
అలాగే మ్యూజిక్, కెమెరా, డైలాగ్స్, ఫైట్స్, ఎడిటింగ్ వంటి టెక్నికల్ యాస్పెక్ట్స్ లో కూడా సంతృప్తికరమైన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాతల మేకింగ్ స్టాండర్డ్స్ ను అభినందించాలి. అవసరమైన మేరకు ఖర్చు చేసి మేకింగ్ పరంగా, పబ్లిసిటీ పరంగా ఎలాంటి లోపమూ లేకుండా సినిమాను రిలీజ్ చేయటం అభినందనీయం.
[wp-review id=”23589″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: