షూటింగ్ లో నాగశౌర్య కు ప్రమాదం

Naga Shaurya Injured On The Sets Of His Upcoming Film,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Young Hero Naga Shaurya Injured,Naga Shaurya Gets Injured On the Sets,Naga Shaurya Injured on His New Movie
Naga Shaurya Injured On The Sets Of His Upcoming Film

టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోలు డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో రిస్కీ షాట్స్ చేయడంతో గాయాలపాలవుతున్నారు. RRR మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, చాణక్య మూవీ లో గోపిచంద్, గ్యాంగ్ లీడర్ లో నాని, వాల్మీకి లో వరుణ్ తేజ్ కు గాయాలయ్యాయి. ఇప్పుడు నాగశౌర్య కు ప్రమాదం జరిగింది.తమ అభిమాన హీరోలకు షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడంతో అభిమానులు ఆందోళనపడుతున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగశౌర్య హీరోగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్టణం లో జరుగుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ KGF చాప్టర్ 1 కు స్టంట్స్ కంపోజ్ చేసిన స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సీన్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. యాక్షన్ సీన్ కోసం వైజాగ్ లోని అరిలోవ ప్రాంతానికి చిత్ర యూనిట్ వెళ్ళింది. 15 అడుగుల ఎత్తు నుండి డూప్ లేకుండా నాగశౌర్య దూకడంతో మోకాలికి తీవ్ర గాయం అయింది. పరీక్షించిన వైద్యులు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. 11 రోజులపాటు ప్లాన్ చేసిన షూటింగ్, నాగశౌర్య కు గాయమవడంతో షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =