బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దీనిలోభాగంగానే గత కొంతకాలంగా ఈ టీమ్ కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక నిన్నటితో కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది చిత్రయూనిట్. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ చాలా వరకూ పూర్తవ్వనున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మరి మామఅల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. అభిమానులు కూడా వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ అంచనాలను వెంకీమామ రీచ్ అవుతుందో?లేదో? చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=N6vxER5O9Bk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: