24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు

Most Viewed Teasers Of Tollywood In 24 hours,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tollywood Most Liked Teasers,With in one hour Most Viewed Telugu Teasers,Saaho Teaser Beats all Records,Top 5 Highest Liked Telugu Teasers
Most Viewed Teasers Of Tollywood In 24 hours

సినిమా ప్రారంభమైన దగ్గర నుండి రిలీజ్ వరకూ సినిమాల అప్ డేట్ లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు హీరోలు, హీరోయిన్ లు, దర్శక నిర్మాతలు. ఇక తమ అభిమాన హీరో సినిమాకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వచ్చిందంటే చాలు క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్ కూడా. వారి సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తుంటారో వ్యూస్ ను బట్టి చెప్పొచ్చు. అందుకే సినిమా టీజరో, ట్రైలరో రిలీజ్ చేస్తే సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఒకప్పుడు 1 మిలియన్స్ వస్తే అదో రికార్డ్.. అవన్నీ పోయాయి.. బాహుబలి తో తుడుచుకుపోయి కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు బాహుబలి రికార్డులు కూడా తుడుచుకుపోయి సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. మరి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్లు ఏంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన టీజర్లు ఇవే.

* ‘సాహో’ ను తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఒక్క తెలుగు టీజర్ కే యూ ట్యూబ్ లో 17 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
* ‘మహర్షి’ టీజర్ కి 24 గంటల్లో 12.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి
* చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమా టీజర్ కు 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి
* 24 గంటల్లో ‘భరత్ అనే నేను’ టీజర్ 11.5 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది
* ‘రంగస్థలం’ టీజర్ కు 24 గంటల్లో 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
* ‘స్పైడర్’ టీజర్ కు 24 గంటల్లో 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
* అల్లుఅర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ టీజర్ 7.8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.
* ‘వినయ విధేయ రామ’ టీజర్ కు 24 గంటల్లో 6.7 వ్యూస్ వచ్చాయి.
* ‘అజ్ఞాతవాసి’ టీజర్ కు 6.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
* ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్ 24 గంటల్లో 5.6 మిలియన్స్ వ్యూస్ ను సొంత చేసుకుంది.

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eight =