
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 43


నెలకొక సినిమాతో సందడి చేయనున్న కార్తికేయ

రజినీ సినిమాలో ప్రముఖ క్రికెటర్?

‘మన్మథుడు 2’ షూటింగ్ అప్‌డేట్

తమిళ సూపర్ స్టార్ విజయ్ సినీ జర్నీ

వాల్మీకి మూవీ ప్రీ టీజర్ కు డేట్ ఫిక్స్

టిటిడి బోర్డు పాలకమండలి సభ్యుడిగా దిల్ రాజు!?

అరుంధతి-2 మూవీ లో పాయల్ రాజ్ పుత్

నిర్మాతగా పవన్ చెర్రీతో మూవీ..!

సవారి మూవీ ఫస్ట్ లుక్ విడుదల

అశ్వమేథం టీజర్ రిలీజ్
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు మూవీ
ముగ్గురు హీరోలతో అర్జున్ రెడ్డి భామ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య

NKR 17 మూవీ ప్రారంభం
అమలాపాల్ నగ్నత్వాన్ని డిమాండ్ చేసిన “ఆమె”

బన్నీ, త్రివిక్రమ్ మూవీ అప్‌డేట్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

నెలకొక సినిమాతో సందడి చేయనున్న కార్తికేయ
‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు కార్తికేయ. నటుడిగా ఆ సినిమా మంచి గుర్తింపే తీసుకువచ్చినా... ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో... గత ఏడాది నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ‘RX 100’తో సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరో... ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ఈ చిత్రాలన్నీ వరుస నెలల్లో విడుదల కావడం విశేషం.

రజినీ సినిమాలో ప్రముఖ క్రికెటర్?
యోగ్‌రాజ్ సింగ్... ఒక క్రికెటర్‌గానే కాదు, ఇండియన్ ఆల్ రౌండర్ అనిపించుకున్న మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రిగానూ ఈ పేరు అందరికీ సుపరిచితమే. క్రికెట్‌తో కెరీర్‌ను ప్రారంభించి అనంతరం నటుడుగా టర్న్ అయిన యోగ్ రాజ్... గత కొంతకాలంగా పంజాబీ సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. అంతేకాదు... ‘సింగ్ ఈజ్ కింగ్’, భాగ్ మిల్కా భాగ్’ వంటి హిందీ సినిమాల్లోనూ సందడి చేశారు యోగ్ రాజ్. కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఓ సౌత్ ఇండియన్ ఫిలింలోనూ యోగ్ రాజ్ దర్శనమివ్వనున్నారని సమాచారం.

‘మన్మథుడు 2’ షూటింగ్ అప్‌డేట్
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా... సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.

తమిళ సూపర్ స్టార్ విజయ్ సినీ జర్నీ
తమిళనాడు లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న విజయ్ ను అభిమానులు దేవుడిగా ఆరాధిస్తారు. అభిమానులు, మీడియా "దళపతి " అని ముద్దుగా పిలుచుకునే విజయ్ ఒక్క రోజులో సూపర్ స్టార్ గా మారలేదు. దాని వెనుక 26 సంవత్సరాల కష్టం, కృషి , పట్టుదల ఉన్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు SA చంద్ర శేఖర్ తనయుడు విజయ్ 1984 సంవత్సరంలో 10 సంవత్సరాల వయసు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ కు పరిచయమయ్యారు. 18 సంవత్సరాల వయసులోహీరోగా మారారు. పూవే ఉనక్కాగ మూవీ తో సక్సెస్ అందుకున్నారు. నేరుక్కునేర్, కాదలుక్కు మరియాదై మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాదలుక్కు మరియాదై మూవీ కి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.

వాల్మీకి మూవీ ప్రీ టీజర్ కు డేట్ ఫిక్స్
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ వాల్మీకి మూవీ రూపొందుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ మూవీ వాల్మీకి. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అధర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

టిటిడి బోర్డు పాలకమండలి సభ్యుడిగా దిల్ రాజు!?
"నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాతో ఇప్పించుకో" అంటూ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ అమరగాయకుడు ఘంటసాల ఆలపించిన భక్తిరసాత్మక గీతంలోని ఆంతర్య , పరమార్థాలు కొందరి జీవితంలో అనూహ్యంగా సిద్ధిస్తుంటాయి. ఆ ఏడుకొండలవాడి దివ్య మంగళ దేదీప్య రూపానికి ప్రత్యక్ష సేవ చేసుకునే అదృష్టం అందరికీ దొరకదు. అందుకు అర్హులైన వారిని ఆయనే నియమించుకుంటాడేమో!

అరుంధతి-2 మూవీ లో పాయల్ రాజ్ పుత్
బ్లాక్ బస్టర్ మూవీ RX 100 లో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్ చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందనున్న అరుంధతి -2 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ శంఖుచక్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కోటి తూముల నిర్మాణ సారథ్యం లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం తో భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో అరుంధతి -2మూవీ రూపొందనుంది.

నిర్మాతగా పవన్ చెర్రీతో మూవీ..!
త్రివిక్రమ్ డైరెక్షన్ .. పవన్ కళ్యాణ్ నిర్మాత.. రామ్ చరణ్ హీరో.. ఆహా ఈ కాంబినేష్ ఊహించుకోవడానికి ఎంత బావుంది. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడాకి చాలా బావుంది కదా. అలాంటి వార్తే ఇప్పుడు టాలీవుడ్ వేదికగా చక్కర్లు కొడుతుంది.

సవారి మూవీ ఫస్ట్ లుక్ విడుదల
సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన గ్రా . బందం రేగడ్ షార్ట్ ఫిల్మ్ యు ట్యూబ్ లో ఘనవిజయం సాధించింది. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిల్మ్స్ బ్యానర్ పై సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా జంతు నేపథ్యంలో న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ సవారి రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

విజయ్ కోసం దుల్కర్ పాట
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో... స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జులై 26 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను.. పాటలను రిలీజ్ చేస్తూ బజ్ పెంచుతున్నారు.

అశ్వమేథం టీజర్ రిలీజ్
నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క
నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టిలింగ్వల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు మూవీ
స్వఛ్చమైన ప్రేమ లోని తీవ్రత, అది విఫలమైనప్పుడు కలిగే బాధ వంటి నేపథ్యం లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా ఒక వినూత్న ప్రేమకథ గా అర్జున్ రెడ్డి మూవీ రూపొందింది. 2017 సంవత్సరంలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. సూపర్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ తమిళ భాషలో రీమేక్ అయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా అర్జున్ రెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీ లో రీమేక్ అయింది.
ముగ్గురు హీరోలతో అర్జున్ రెడ్డి భామ
'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆతరువాత మంచి అవకాశాలతో దూసుకుపోతుంది షాలినిపాండే. షాలిని కూడా మంచి కథలనే ఎంచుకొని కెరీర్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన 'అర్జున్ రెడ్డి', 'మహానటి', '118' ఇలా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందించనున్నారు. నాగచైతన్య 20 వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య వెంకీ మామ మూవీ లో నటిస్తున్నారు.
రాజ్ దూత్ నుండి "మనసున మనసున" లిరికల్ సాంగ్ రిలీజ్
కార్తీక్ - అర్జున్ దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా 'రాజ్ దూత్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలోనే పూర్తిచేసి జులై 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి మార్కులు పడ్డాయి.

NKR 17 మూవీ ప్రారంభం
సూపర్ హిట్ మూవీ 118 తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా NKR 17 మూవీ ఈ రోజు ప్రారంభమయింది. సూపర్ హిట్ మూవీ శతమానం భవతి వంటి కథా చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ NKR 17 ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెడుతున్నారు .
అమలాపాల్ నగ్నత్వాన్ని డిమాండ్ చేసిన “ఆమె”
ఇప్పుడు సౌత్ ఇండియాలో అమలాపాల్ నటించిన “ఆమె” చిత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో రత్న కుమార్ దర్శకత్వంలో వి స్టూడియోస్ పతాకంపై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన “ఆడై” చిత్రాన్ని తెలుగులో “ఆమె” పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అమలాపాల్ ఒక సన్నివేశంలో పూర్తి నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. అత్యాచారానికి గురైన అమలాపాల్ సన్నివేశం డిమాండ్ మేరకే అలా నగ్నంగా నటించవలసి వచ్చింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దర్శకుడు చెప్పిన సన్నివేశంలోని తీవ్రత, ఇంటెన్సిటీ పట్ల కన్విన్స్ అయినందువల్లనే తాను నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అమలాపాల్ సమర్థించుకుంటోంది.
'డియర్ కామ్రేడ్' నుండి మూడో లిరికల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా హిట్ అవ్వడంతో.. సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు కూడా ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈలోపు వారి నిరీక్షణకు కాస్త ఊరటనిచ్చేవిధంగా ఈ సినిమా నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ కూల్ చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, రెండు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్ ను రిలిజ్ చేసింది.