తమిళనాడు లో ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న విజయ్ ను అభిమానులు దేవుడిగా ఆరాధిస్తారు. అభిమానులు, మీడియా “దళపతి ” అని ముద్దుగా పిలుచుకునే విజయ్ ఒక్క రోజులో సూపర్ స్టార్ గా మారలేదు. దాని వెనుక 26 సంవత్సరాల కష్టం, కృషి , పట్టుదల ఉన్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు SA చంద్ర శేఖర్ తనయుడు విజయ్ 1984 సంవత్సరంలో 10 సంవత్సరాల వయసు లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ కు పరిచయమయ్యారు. 18 సంవత్సరాల వయసులోహీరోగా మారారు. పూవే ఉనక్కాగ మూవీ తో సక్సెస్ అందుకున్నారు. నేరుక్కునేర్, కాదలుక్కు మరియాదై మూవీస్ ఘనవిజయం సాధించాయి. కాదలుక్కు మరియాదై మూవీ కి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2000 సంవత్సరం నుండి విజయ్ ఎంటర్ టైన్ బేస్డ్ మూవీస్ లో నటించారు. తరువాత యా క్షన్ మూవీస్ కు టర్న్ అయ్యారు. విజయ్ నటించిన యాక్షన్, రొమాంటిక్ మూవీ తిరుమలై ఘనవిజయం సాధించి, విజయ్ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. 2004 లో గిల్లీ (ఒక్కడు రీమేక్ ) ఘనవిజయం సాధించి 200డేస్ ప్రదర్శించబడి ,50 కోట్లు కలెక్ట్ చేసింది. మదురై, తిరుప్పాచ్చి, శివకాశి చిత్రాలు
కమర్షియల్ గా సక్సెసయ్యాయి. 2007 సంవత్సరఎంతో పోక్కిరి (పోకిరి రీమేక్ )తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ కేరళ స్టేట్ లో 100 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.
2009 సంవత్సరంలో వేట్టైక్కారన్ మూవీ 80 కోట్లు కలెక్ట్ చేసింది. 2012 నుండి రజని కాంత్ వలె కమర్షియల్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టారు. మిడిల్ క్లాస్ పాత్రలలో నటించారు. విజయ్ తన కో స్టార్స్ అజిత్,సూర్య ,విక్రమ్ వలే క్యారెక్టర్స్ తో ప్రయోగాలు చేయకుండా తన కంఫర్ట్ జోన్ లోనే మూవీస్ లో నటిస్తున్నారు . సూపర్ స్టార్ విజయ్ హీరో గా నటించిన తుప్పాక్కి, కత్తి, తెరి, భైరవ, మెర్సల్, సర్కార్ మూవీస్ ఘనవిజయం సాధించిన 100కోట్ల క్లబ్ లో చేరాయి. 2009 సం. లో విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ పేరుతో సోషల్ వెల్ఫేర్ సంస్థను ప్రారంభించి తుఫాను బాధితులకు, ఇతర బాధితులకు అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు . ఈ రోజు విజయ్ బర్త్ డే సందర్భంగా అట్లీ కుమార్ దర్శకత్వం లో విజయ్ హీరోగా రూపొందుతున్న బిజిల్ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సూపర్ స్టార్ విజయ్ కు బర్త్ డే శుభాకాంక్షలు – తెలుగు ఫిల్మ్ నగర్
[youtube_video videoid=CVmHJ271mfo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: