రాజ్ దూత్ నుండి “మనసున మనసున” లిరికల్ సాంగ్ రిలీజ్

2019 Latest Telugu Movie News,Manasuna Manasuna Song From Rajdooth Movie Out Now,Manasuna Manasuna lyrical song from RajDooth,Rajdooth Movie Manasuna Manasuna Song,Rajdooth Movie Latest News,Rajdooth Telugu Movie songs, Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Manasuna Manasuna Song from rajdooth movie, Rajdooth songs
Manasuna Manasuna Song From Rajdooth Movie Out Now

కార్తీక్ – అర్జున్ దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా ‘రాజ్ దూత్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలోనే పూర్తిచేసి జులై 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి మార్కులు పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి మనసున మనసున అనే లిరికల్ ను రిలీజ్ చేశారు. “మనసున మనసున ఏదో ఆశ .. మొదలే ఇవ్వాళ .. కనులకు కనులకు రాదే నిదుర అరెరే అనేలా .. కలలోనా నువ్వేకదా .. ఎదలోనా నువ్వేకదా” అంటూ ఈ పాట సాగుతోంది. వరుణ్ సునీల్ సంగీతం .. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం .. సిద్ధార్థ్ మీనన్ ఆలాపన యూత్ కి కనెక్ట్ అయ్యేలా వున్నాయి.

కాగా ఈ సినిమాలో నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌, ఏడిద శ్రీరామ్‌, దేవిప్రసాద్‌, అనిష్‌ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్‌, దువ్వాసి మోహన్‌, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు తదితరులు నటిస్తున్నారు. వరుణ్ సునీల్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

[youtube_video videoid=jdNOXnee7Es]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + six =