ఇప్పుడు సౌత్ ఇండియాలో అమలాపాల్ నటించిన “ఆమె” చిత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది.
తమిళంలో రత్న కుమార్ దర్శకత్వంలో వి స్టూడియోస్ పతాకంపై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన “ఆడై” చిత్రాన్ని తెలుగులో “ఆమె” పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో
హీరోయిన్ అమలాపాల్ ఒక సన్నివేశంలో పూర్తి నగ్నంగా నటించడం సంచలనంగా మారింది.
అత్యాచారానికి గురైన అమలాపాల్ సన్నివేశం డిమాండ్ మేరకే అలా నగ్నంగా నటించవలసి వచ్చింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దర్శకుడు చెప్పిన సన్నివేశంలోని తీవ్రత, ఇంటెన్సిటీ పట్ల కన్విన్స్ అయినందువల్లనే తాను నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అమలాపాల్ సమర్థించుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ” నీకు జరిగిన దానికి తిరిగి నువ్వు ఏం చేస్తావో అనేదే స్వాతంత్ర్యం” – అనే ఒక డైలాగ్ కూడా వుంటుంది. అంటే తన మీద జరిగిన అత్యాచారానికి ఆ పాత్ర తీసుకునే ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుంది అనేది సస్పెన్స్ పాయింట్.
ఇదిలా ఉంటే అమలాపాల్ పూర్తి నగ్నంగా నటించడం పట్ల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, ప్రముఖ హీరోయిన్ సమంత ట్విట్టర్ ద్వారా హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాంటి సన్నివేశంలో బోల్డ్ గా నటించిన అమలాపాల్ కు వారు అభినందనలు తెలియజేయడం కూడా సంచలనానికి, వివాదానికి దారి తీస్తుంది.
ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు అమలాపాల్ మీద ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
బట్టలు విప్ప తీసుకుని నటించడంలో సిగ్గుమాలిన తనమే తప్ప బోల్డ్ నెస్ ఏముంది? అమలాపాల్ ఆడజాతి పరువు తీసింది.. అని కొందరు నిలదీస్తుంటే… సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ అలా చేయటంలో తప్పేమీ లేదని కొందరు సమర్ధిస్తున్నారు.
ట్రైలర్ చూసి నమ్మలేకపోతున్న కొంతమంది నెటిజన్లు అమలాపాల్ పూర్తి నగ్నంగా నటించలేదు… ఆమె స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుంది అని కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనా “ఆమె” కోసం అమలాపాల్ చేసింది సాహసమా? త్యాగమా? బరితెగింపా? పాత్రోచిత
న్యాయమా?
ఈ ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తేగాని తెలియదు.
అప్పటిదాకా” ఆమె” ఒక వివాదాస్పద సంచలనమే.
[youtube_video videoid=nDvXQKpkRzk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: