కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 44

Raju Gari Gadhi 3 Movie Launched,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Raju Gari Gadhi 3 Movie Latest News,Tamanna Next Film Raju Gari Gadhi 3,Tamannaah New Movie Launched Today
సినిమా వార్తలు

ప్రారంభమైన రాజు గారి గది 3 మూవీ

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ, హారర్ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది2 మూవీ కూడా రూపొందింది. ఇప్పుడు రాజు గారి గది 3 మూవీఈ రోజు (20వ తేదీ )లాంఛనంగా ప్రారంభమయింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న రాజు గారి గది 3 మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. అశ్విన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్ సహాయక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యానిమేటెడ్ మూవీకి గాత్రదానం - 'పుంబా'కు బ్రహ్మీ 'టిమోన్'కు అలీ

ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు గాత్ర దానం చేయడం కామన్ అయిపోయింది. ఇటీవల రానా 'అవెంజెర్స్ ఎండ్ గేమ్' సినిమాలో థానోస్ కు గాత్రదానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లావుద్దీన్ సినిమాకు వెంకీ, వరుణ్ కూడా గాత్రదానం చేశారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా, అల్లావుద్దీన్ కి వరుణ్ గొంతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ తమ గొంతును అరువివ్వనున్నారు. వారు ఎవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం, అలీ.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Will The Same Sentiment Repeat For Nagarjuna Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest Updates, Same Sentiment Work For Manmadhudu 2, Manmadhudu 2 movie latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema
సినిమా వార్తలు

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ ద‌క్కుతుందా?

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్... ‘అంతఃపురం’(1998) చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ... తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’(స‌మ‌ర్ప‌ణ‌), ‘ఒకరికి ఒకరు’, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘మజ్ను’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి... నిర్మాణ రంగంలో మంచి అభిరుచి గల సంస్థగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Raashi Khanna and Sai dharam tej Combination To Repeat once Again, Raashi Khanna and Sai dharam tej Combo is Back, Raashi Khanna and Sai dharam tej To Work Together Again, Raashi Khanna upcoming Movie Updates, Raashi Kh
సినిమా వార్తలు

మెగా హీరో తో మరోసారి జంటగా రాశీఖన్నా

అనిల్ రావిపూడి దర్శకత్వం లో మెగా హీరో సాయి తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి తేజ్ హీరోగా రూపొందే మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వం లో సాయి తేజ్, రాశీఖన్నాజంటగా రూపొందే మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సాయి తేజ్ తో రెండవ సారి రాశీఖన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్

“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’ విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌య్య పాత్ర‌లో ఎలాంటి మార్పులు లేవ‌ట‌

‘జై సింహా’ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.క‌ళ్యాణ్‌, సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్‌ కాంబినేషన్‌లో మ‌రో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. అలాగే... ఈ చిత్రానికి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు ఈ మ‌ధ్య ప‌లు క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ ఆ వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

నందిత శ్వేత 'అక్షర' టీజర్ రిలీజ్

'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ప్రేమ కథా చిత్రమ్', 'అభినేత్రి' 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు అక్షర తో మరోసారి భయపెట్టడానికి వచ్చేస్తుంది. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Shalini Pandey To Play Interesting Role, Shalini Pandey latest movie updates, Shalini Pandey next project details, actress shalini pandey New Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Sha
సినిమా వార్తలు

‘మహానటి’ బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ‌?

ఇటీవల ‘118’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ కథానాయిక షాలినీ పాండే... తనకు ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన స్వప్న సినిమా బ్యానర్‌లో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొర‌టాల సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న‌ చిరు?

తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ సినిమా. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఇదిలా ఉంటే... ‘సైరా’ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. అయితే... ‘సైరా’లోని పాత్ర కోసం బాగా బరువు పెరిగిన చిరు... ఇప్పుడు కొరటాల శివతో చేయబోయే మూవీ కోసం సన్నగా, స్మార్ట్ అండ్ స్టైలిష్…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అశ్వమేథం' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ లాంచ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఓ బేబి ట్రైలర్ రిలీజ్

పెళ్లైన తరువాత చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ సమంత వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓ బేబి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Bharathi Raja raising Telugu Tamil Separation Controversy,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bharathi Raja Latest News,Director Bharathi Raja Controversy,Bharathiraja Controversy Comments on Telug
సాంగ్

తెలుగు - తమిళ ఏర్పాటు వాదన్ని రెచ్చగొడుతున్న భారతీ రాజ

If you want to kill a dog name it mad... అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే నీకు గిట్టనివాళ్ళకు కీడు చేయాలి అంటే వాళ్లకు లేని అపవాదు ఏదో అంట గట్టాలి. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ విషయంలో జరుగుతుంది అదే. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా తమిళ చిత్ర రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాల్ మీద ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం హద్దులు దాటుతుంది. ఈ నెల 23న జరుగనున్న నడిగర్ సంఘం ఎన్నికలలో మరోమారు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విశాల్ ను , అతని ప్యానల్ ను ఓడించటం కోసం ప్రత్యర్థి వర్గం ఎన్నుకున్న ఆయుధం "తమిలేతరుడు"."తమిళుడు కాని విశాల్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Akshara Teaser Gets a Release Date,Akshara Telugu Movie Teaser Release Date,Akshara Movie Teaser Released Date Locked,Akshara Teaser Released Date Fixed,Akshara Movie Teaser Released Date Announced,Akshara Movie Latest U
ట్రైలర్ & టీజర్

అక్షర టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో 'అక్షర' అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బి. చిన్నికృష్ణ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేయగా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Voter Movie Rights Acquired By Popular Production House,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Theatrical Rights,Voter Movie Rights,Voter Movie Latest Updates,Voter Telugu Movie Latest New
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'ఓటర్' మూవీ రైట్స్

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Ranarangam Team Wishes Kajal Aggarwal On Her Birthday ,2019 Latest Telugu Movie News,Kajal First Look From Ranarangam Movie,Kajal Aggarwal New Look From Ranarangam,First Look of Kajal Aggarwal in Ranarangam,Ranarangam Movie Latest Updates,Telugu Film
ఫస్ట్ లుక్

'రణరంగం' నుండి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఎంతో మంది యంగ్, సీనియర్ హీరోలతో పనిచేసిన ఈ భామ.. ఇండస్రీలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు తాజాగా 'రణరంగం' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Raj Tarun and Sathya Sai Arts Movie Launched,Raj Tarun New Movie Launched Today,Raj Tarun Next Project Details,Raj Tarun Signs A New Project,Raj Tarun Signs Another Crazy Project,Raj Tarun Upcoming Films News,Telugu Film
సినిమా వార్తలు

సత్య సాయి ఆర్ట్స్ కొత్త సినిమా ప్రారంభం

నిర్మాత KK రాధా మోహన్ నిర్మాణ సారథ్యం లో సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఏమైందీ ఈ వేళ, బెంగాల్ టైగర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రోజు ఒక కొత్త సినిమా పూజ కార్యక్రమం జరుపుకుంది. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 గా వ్యవరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Is Andhra Pradesh Chief Minister YS Jagan A Huge Fan Of Balakrishna?,YS Jagan Die Hard Fan of Balakrishna,AP CM YS Jagan About Balakrishna,YS Jagan Big Fan of Balayya,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema
స్పెషల్

సమరసింహా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అభినందనలు

కాలం చాలా విచిత్రమైంది. కాలగమనంలో ఊహకందని మలుపులు , ఊహాతీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి - నందమూరి నటసింహం బాలకృష్ణల అనుబంధం గురించి చెప్పుకోవచ్చు. సినిమాల పట్ల, సినిమా రంగంపట్ల నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప అభిమానం, ఆసక్తి ఉన్నాయి అనటానికి తాజా ఉదాహరణలు ఏమీ లేవు కానీ ఒకప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అన్నది మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu About His Fans,Die Hard Fans of Mahesh Babu,Mahesh Babu Says Thanks to His Fans,Maheshbabu New Movie News,Maheshbabu Upcoming Films,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News
సినిమా వార్తలు

నా సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కి అభిమానులే కారణం

సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి సక్సెస్ ను మహేష్ బాబు తన ఫ్యామిలీ తో జర్మనీ లో ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించే 26 వ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటారు. సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో తన సక్సెస్ ఫుల్ జర్నీ గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Balakrishna and Shriya Saran To Work Together Again,Shriya to Team Up With Balakrishna,Shriya Saran to Pair Up Again With Nandamuri Balakrishna,Balakrishna and Shriya Combo is Back,Balakrishna and Shriya Combination To R
సినిమా వార్తలు

మ‌రోసారి బాలయ్యకి జోడీగా శ్రియ?

నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికలలో శ్రియ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’, `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు` (శ్రియ అతిథి పాత్ర‌) చిత్రాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ ఇద్ద‌రు మరోసారి జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,50 Years For Sattekalapu Satteya Movie,Sattekalapu Satteya Movie completes 50 years,shoban Babu Sattekalapu Satteya Movie completed 50 years,Sattekalapu Satteya Movie Turns 50 Years,Sattekalapu Satteya Movie Latest News,
సినిమా వార్తలు

‘సత్తెకాలపు సత్తెయ్య’కు 50 ఏళ్ళు

తెర వెనక చలం, శోభన్ బాబు ఎంత మంచి స్నేహితులో... తెరపై కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ అంతటి విజయవంతమైనది. ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన ప‌లు సినిమాలు విజయవంతం కాగా... వాటిలో ‘సత్తెకాలపు సత్తెయ్య’ ఒకటి. దర్శ‌క‌దిగ్గ‌జం కె.బాలచందర్ రూపొందించిన‌ ఈ చిత్రంలో చలం, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా... రాజశ్రీ, విజయలలిత, బేబి రోజారమణి, గుమ్మడి, వరలక్ష్మి, సత్యనారాయణ త‌దిత‌రులు ముఖ్య భూమికలను పోషించారు. ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పనలో రూపొందిన బాణీలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో “నన్ను ఎవరో తాకిరి”, “ముద్దు ముద్దు నవ్వు” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి.

Team TFNవాట్సాప్

షేర్