
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 42


‘సైరా’... డబ్బింగ్ పూర్తి చేసిన చిరు

డబ్బింగ్ లో చిరంజీవి రికార్డ్

మరోసారి బన్నీ సరసన నివేదా?

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్

అమలాపాల్ ఆవేదన తో ప్రెస్ నోట్ రిలీజ్

హిందీ ‘జెర్సీ’కి నిర్మాతగా ‘దిల్’ రాజు?

#NC20 మూవీ ప్రారంభం

రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో మేఘా ఆకాష్
వాయిదా పడ్డ ‘బుర్రకథ’

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం రెండు తేదీలు
చిరు-కొరటాల కాంబినేషన్ మూవీ అప్‌డేట్

రాజశేఖర్, ఆది... సేమ్ టు సేమ్
మరోసారి డబ్బింగ్ చెప్పిన నివేదా థామస్

రానా బాలీవుడ్ మల్టీ స్టారర్ షూటింగ్ షురూ

మహర్షి మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్

మరోసారి `మనం` కాంబినేషన్?

జూ.ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు - ఆ వార్తల్లో నిజం లేదు
దివంగత నటుడు రియల్ హీరో శ్రీహరి చిన్న తనయుడు మేఘాంశ్ హీరోగా కార్తిక్-అర్జున్ దర్శకత్వంలో 'రాజ్ దూత్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సంగతి ఎలా ఉన్నా... మేఘాంశ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

‘సైరా’... డబ్బింగ్ పూర్తి చేసిన చిరు
బ్రిటీష్ వారిని, వారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయన జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే.

డబ్బింగ్ లో చిరంజీవి రికార్డ్
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి బయోపిక్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతుంది. నయనతార, తమన్నా కథానాయికలు కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సైరా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 10 రోజుల క్రితం చిరంజీవి తన పాత్ర కు శబ్దాలయా స్టూడియో లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. సైరా మూవీ లోని తన క్యారెక్టర్ కున్న భారీ డైలాగ్…

మరోసారి బన్నీ సరసన నివేదా?
‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక నివేదా పేతురాజ్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు పొందిన నివేదా... ఆ తరువాత ‘చిత్రలహరి’లోనూ అలరించింది. అలాగే నివేదా తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ ఈ రోజు (జూన్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ నటిస్తుండగా... నివేదా సెకండ్ హీరోయిన్‌గా దర్శనమివ్వనుంది. అంతేకాదు... బన్నీ తదుపరి చిత్రంలోనూ నివేదా…

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్
అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవైపు తొలి భారతీయ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘కార్గిల్ గర్ల్’లో నటిస్తూనే... మరోవైపు రాజ్‌కుమార్ రావ్‌తో కలసి హారర్ కామెడీ మూవీ ‘రూహీ అఫ్జా’లోనూ నటిస్తోంది జాన్వి. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండగానే తాజాగా మరో చిత్రంలోనూ నాయికగా ఎంపికైంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

అమలాపాల్ ఆవేదన తో ప్రెస్ నోట్ రిలీజ్
నీల తామర మూవీ తో మల్లువుడ్ కు పరిచయమైన అమలాపాల్ కోలీవుడ్ లో నటించిన మైనా మూవీ ఘనవిజయం సాధించింది. బెజవాడ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన అమలాపాల్ నటించిన లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో మూవీస్ విజయం సాధించాయి. అమలాపాల్ ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. అమలాపాల్ నగ్నం గా నటించిన ఆడై తమిళ మూవీ టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

హిందీ ‘జెర్సీ’కి నిర్మాతగా ‘దిల్’ రాజు?
టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ‘దిల్’ రాజు... ఎప్పటినుంచో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే... మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌కు... ‘భారతీయుడు’ సీక్వెల్ ‘భారతీయుడు 2’ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా నిర్మించే అవకాశం దక్కినా... కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో... తనే నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్ 2’ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ‘దిల్’ రాజు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. అంతేకాదు... తాజాగా మరో తెలుగు చిత్రాన్ని…

#NC20 మూవీ ప్రారంభం
బ్లాక్ బస్టర్ మూవీ ఫిదా తరువాత నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ హిట్ మజిలీ మూవీ తో మంచి ఫామ్ లో ఉన్న హీరో నాగచైతన్య, ఫిదా మూవీ తో ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ రూపొందనుంది. అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు. రాందాస్ నారంగ్, FDC ఛైర్మన్ రామ్మోహనరావు, అమిగో క్రియేషన్స్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.
బన్నీ-త్రివిక్రమ్ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
`నా పేరు సూర్య` తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రాజ్ దూత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
MLV సత్యనారాయణ (సత్తిబాబు ) నిర్మాణ సారథ్యంలో లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రియల్ స్టార్ తనయుడు మేఘాంశ్ శ్రీహరి రాజ్ దూత్ మూవీ ద్వారా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మేఘాంశ్ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకొని హీరోగా ప్రేక్షకులను పలుకరించనున్నారు. అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రాజ్ దూత్ మూవీ రూపొందింది.

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో మేఘా ఆకాష్
‘లై’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాష్. ఆ తరువాత ‘ఛల్ మోహన రంగ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మేఘ... ప్రస్తుతం ‘మను చరిత్ర’తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘పేట్టై’తో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి... ఆ తరువాత ‘వంద రాజవదాన్ వరువేన్` (`అత్తారింటికి దారేది` రీమేక్), ‘బూమ్‌రాంగ్’ వంటి చిత్రాలతో తమిళ ఆడియన్స్‌నూ అలరించింది. ఈ నేపథ్యంలో... మేఘ తాజాగా మరో తమిళ సినిమాకు సైన్ చేసినట్టు కోలీవుడ్ టాక్.
వాయిదా పడ్డ ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బుర్రకథ’. మిస్టీ చక్రవర్తి, నైరాషా కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. రెండు మెదళ్ళు ఉన్న ఓ యువకుడి చుట్టూ తిరిగే కథాంశంతో `బుర్రకథ` తెరకెక్కింది. అభిమన్యు సింగ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

బన్నీ-త్రివిక్రమ్ సినిమా కోసం రెండు తేదీలు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ది లయన్ కింగ్’ ఇండియన్ వెర్షన్స్‌కి ప్రముఖుల డబ్బింగ్
భావోద్వేగాలకు భాష అవసరం లేదు... మనసును తాకితే చాలు... ఆ సినిమాకి విజయం తథ్యం అని నిరూపించిన చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ ఒకటి. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్ ఎపిక్ మ్యూజికల్ యానిమేటెడ్ మూవీని ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మించింది ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్. చారిత్రక విజయం సాధించిన ఈ చిత్రాన్ని... మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళ తరువాత ‘ది జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరేవ్... ఇప్పటి తరం ప్రేక్షకుల కోసం ఫోటో రియలస్టిక్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ టెక్నాలజీతో 3D వెర్షన్‌లో తెరకెక్కించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జూలై 19న విడుదల కానుంది. కాగా…
చిరు-కొరటాల కాంబినేషన్ మూవీ అప్‌డేట్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... ఈ నెల 24తో షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోయే తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు చిరు. ఇప్పటికే చిరు కోసం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో పాటు డైలాగ్ వెర్షన్‌తో సహా సిద్ధం చేసాడట కొరటాల. చిరు డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వనున్న ఈ చిత్రంలో... ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి ఎన్నారై పాత్ర అని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ…

రాజశేఖర్, ఆది... సేమ్ టు సేమ్
కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా భలే గమ్మత్తుగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన విషయమే... సీనియర్ హీరో రాజశేఖర్, యంగ్ హీరో ఆది విషయంలో రెండేళ్ళ క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే... 2017 నవంబర్ 3న సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18M’ చిత్రం విడుదలైంది. అదే రోజున యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాల తరువాత ఈ ఇద్దరు హీరోల నుంచి 2018లో ఒక్క సినిమా కూడా తెరపైకి రాలేదు. కట్ చేస్తే... 2019లో మళ్ళీ ఒకే రోజున ఈ ఇద్దరు హీరోలు తమ…
మరోసారి డబ్బింగ్ చెప్పిన నివేదా థామస్
`జెంటిల్‌మన్` (2016)తో టాలీవుడ్‌కి కథానాయికగా పరిచయమైంది నివేదా థామస్. ఆ చిత్రంతో మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ చిత్రాలతోనూ అలరించింది నివేదా. ఇక ఇటీవల విడుదలైన ‘118’తో మరో విజయాన్ని అందుకున్న ఈ భామ... ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే... నివేదా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు సిద్ధమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్‌గా ఎదగాలనుకునే పాత్రలో నటించింది నివేదా. అంతేకాదు, ఈ చిత్రం కోసం తన…

రానా బాలీవుడ్ మల్టీ స్టారర్ షూటింగ్ షురూ
టాలీవుడ్ హల్క్ రానా అటు తెలుగు తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీ షెడ్యూల్ తో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే విరాటపర్వం సినిమా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. ఇక రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించడమే తరువాయి భాగం. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాకు డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

మహర్షి మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజ హెగ్డే నటించిన మహర్షి మూవీ మే 9 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ గా రూపొందిన మహర్షి మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మహర్షి మూవీ ని రిలీజ్ కు ముందు , తరువాత కూడా మహేష్ బాబు ప్రమోట్ చేయడం విశేషం.

మరోసారి `మనం` కాంబినేషన్?
‘మనం’... అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా... అక్కినేని కుటుంబానికి మరపురాని చిత్రంగా నిలచిపోయింది. బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ రూపొందించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అటు అక్కినేని అభిమానులకే కాదు... ఇటు సగటు ప్రేక్షకులకు కూడా నయనానందాన్ని కలిగించింది. కట్ చేస్తే... ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నాగార్జున, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని సమాచారం.