‘ప్రేమతో మీ కార్తీక్’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు కార్తికేయ. నటుడిగా ఆ సినిమా మంచి గుర్తింపే తీసుకువచ్చినా… ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో… గత ఏడాది నూతన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ‘RX 100’తో సంచలన విజయం అందుకున్నాడు కార్తికేయ. ఆ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ హీరో… ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ చిత్రాలన్నీ వరుస నెలల్లో విడుదల కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఇప్పటికే ఈ నెలలో అంటే జూన్ 6న ‘హిప్పీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో… జూలై నెలలో ‘గుణ 369’తో థియేటర్‌ల్లో సందడి చేయడానికి సిధ్ధపడుతున్నాడు. ఇక ఆగస్టులో `గ్యాంగ్ లీడర్`తో పలకరించనున్నాడు కార్తికేయ. నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు కార్తికేయ. అలాగే కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం ’90 ML’ సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని టాక్.
మొత్తమ్మీద… నెలకొక సినిమాతో పలకరించబోతున్న ఈ టాలెంటెడ్ హీరోకి… ఆ యా సినిమాలు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
[youtube_video videoid=ThfqNQj2lfA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: