యోగ్‌రాజ్ సింగ్… ఒక క్రికెటర్‌గానే కాదు, ఇండియన్ ఆల్ రౌండర్ అనిపించుకున్న మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రిగానూ ఈ పేరు అందరికీ సుపరిచితమే. క్రికెట్‌తో కెరీర్‌ను ప్రారంభించి అనంతరం నటుడుగా టర్న్ అయిన యోగ్ రాజ్… గత కొంతకాలంగా పంజాబీ సినీ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. అంతేకాదు… ‘సింగ్ ఈజ్ కింగ్’, భాగ్ మిల్కా భాగ్’ వంటి హిందీ సినిమాల్లోనూ సందడి చేశారు యోగ్ రాజ్. కాగా, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఓ సౌత్ ఇండియన్ ఫిలింలోనూ యోగ్ రాజ్ దర్శనమివ్వనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ రజినీకాంత్, పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో ‘దర్బార్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యోగ్‌రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. రజినీ పోలీస్ అధికారిగా దర్శనమివ్వనున్న ఈ సినిమాలో… ఫస్ట్ ఫైట్ సీన్‌లో రజినీతో కలసి తలపడనున్నారట యోగ్‌రాజ్. ఈ పోరాట ఘట్టం `దర్బార్`లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.
కాగా… మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు కల్లా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుంటుందని కోలీవుడ్ టాక్. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=jrWJtIAzXmk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: