విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా హిట్ అవ్వడంతో.. సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు కూడా ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈలోపు వారి నిరీక్షణకు కాస్త ఊరటనిచ్చేవిధంగా ఈ సినిమా నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ కూల్ చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, రెండు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్ ను రిలిజ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే” అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ – యామినీ ఘంటసాల ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. కడలల్లే వేచి కలలే లాంటి మంచి మెలొడీ సాంగ్ ను ఇచ్చిన జస్టిన్.. మరో మెలొడీ సాంగ్ ను ఇచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాగా భరత్ కమ్మ దర్శకత్వంలో లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను బిగ్‌బెన్ సినిమా, మైత్రీ మూవీమేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాకినాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తుండగా.. రష్మిక మందన మహిళా క్రికెటర్‌గా కనిపిస్తోంది. మరి గీతగోవిందం సినిమాతో హిట్ కొట్టిన.. ఈ హిట్ కాంబో.. డియర్ కామ్రెడ్ సినిమాతో హిట్ అందుకుంటుందో.. లేదో.. చూద్దాం..
[youtube_video videoid=x0VTyt7CemI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: