“నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాతో ఇప్పించుకో” అంటూ కలియుగ దైవమైన వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ అమరగాయకుడు ఘంటసాల ఆలపించిన భక్తిరసాత్మక గీతంలోని
ఆంతర్య , పరమార్థాలు కొందరి జీవితంలో అనూహ్యంగా సిద్ధిస్తుంటాయి. ఆ ఏడుకొండలవాడి దివ్య మంగళ దేదీప్య రూపానికి ప్రత్యక్ష సేవ చేసుకునే అదృష్టం అందరికీ దొరకదు. అందుకు అర్హులైన వారిని ఆయనే నియమించుకుంటాడేమో!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అలాంటి అదృష్టం చిత్రసీమలో సుప్రసిద్ధ నిర్మాత అయిన దిల్ రాజు కు దక్కబోతోంది అనే వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. ఈరోజు జరిగిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి దిల్ రాజు కూడా హాజరయ్యారు. వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన దిల్ రాజు తన సంస్థకు “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” అని నామకరణం చేసి ఇదే బ్యానర్ పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఉభయ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో దిల్ రాజును టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించవలసిoదిగా తెలంగాణ యువనేత కేటీఆర్ జగన్మోహన్ రెడ్డిని కోరారట. ఆ కోరికను జగన్మోహన్ రెడ్డి వెంటనే ఆమోదించారట. సో …. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా దిల్ రాజు నియామకం దాదాపు ఖరారైనట్లే.
నిజానికి ఇది ఒక ఆరోగ్యకర పరిణామం. సాధారణంగా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం పాలకులు, బ్యూరోక్రాట్స్ నైజం. అయితే పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖుడిని తమ రాష్ట్రానికి చెందిన కీలక పదవిలో నియమించడం ద్వారా ఒక సుహృద్భావ వాతావరణానికి జగన్మోహన్ రెడ్డి స్వాగతం చెప్పారని భావించవచ్చు.
మొత్తానికి వెంకటేశ్వర స్వామి భక్తుడైన “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” అధినేత దిల్ రాజుకు వెంకటేశ్వర సేవా భాగ్యం లభించటం అదృష్టం- అభినందనీయం.
[youtube_video videoid=d7pKlI6b2zc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























