ది లయన్ కింగ్’ ఇండియ‌న్ వెర్ష‌న్స్‌కి ప్ర‌ముఖుల డ‌బ్బింగ్‌

2019 Latest Telugu Movie News, Tollywood Celebs Dub For The Lion King Telugu Version,Comic talents Brahmanandam and Ali to lend voice for The Lion King ,Jagapathi Babu, Ravi Shankar dub for The Lion King, Star Tollywood comedians dub for The Lion King, List of Indian dubbing artists for The lion king movie, The lion king movie latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Tollywood Celebs Dub For The Lion King Telugu Version

భావోద్వేగాల‌కు భాష అవసరం లేదు… మనసును తాకితే చాలు… ఆ సినిమాకి విజయం తథ్యం అని నిరూపించిన చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ ఒక‌టి. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్ ఎపిక్ మ్యూజిక‌ల్‌ యానిమేటెడ్ మూవీని ఓ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా నిర్మించింది ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్‌. చారిత్ర‌క విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని… మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళ తరువాత ‘ది జంగిల్ బుక్’ దర్శకుడు జాన్ ఫేవరేవ్… ఇప్పటి తరం ప్రేక్షకుల కోసం ఫోటో రియలస్టిక్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ టెక్నాలజీతో 3D వెర్ష‌న్‌లో తెర‌కెక్కించాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా జూలై 19న విడుద‌ల కానుంది. కాగా…. ఈ సినిమాలో ముఖ్య పాత్రలైన ముఫాసా, స్కార్, సింబా, టిమాన్, పుంబాలకు అప్పట్లో ప్రముఖుల చేత డబ్బింగ్ చెప్పించి విజయం సాధించిన చిత్ర బృందం… ఇప్పుడు కూడా అదే పంథాను ఎంచుకుంది. అయితే… ఈ సారి ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లోనూ విడుదల కానున్న ఈ చిత్రానికి ఆ యా భాషల్లో ప్రముఖుల చేత డబ్బింగ్ చెప్పించడం, చెప్పిస్తుండడం విశేషం. ఇక మన దేశం విషయానికొస్తే… ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం ముఫాసా పాత్రకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సింబా పాత్ర కోసం అతని తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలాగే… మలయాళంలో కూడా ముఫాసా, సింబా పాత్రల కోసం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, అతని తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ గాత్ర దానం చేసారు. ఇక తెలుగులో కూడా ముఫాసా పాత్ర కోసం రవిశంకర్ డబ్బింగ్ చెప్పగా… విల‌న్ పాత్ర అయిన స్కార్ కోసం జగపతి బాబు తన గొంతును వినిపించారు. అలాగే… టిమాన్, పుంబా పాత్రలకు హాస్య నటులు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే సింబా పాత్ర డబ్బింగ్‌కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య భాషల్లోనూ ప్రముఖులు డబ్బింగ్ చెబుతున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో తెలియాలంటే జూలై 19 వరకు వేచి ఉండాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=iZnkJjhZOsc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 7 =