రాజ‌శేఖ‌ర్‌, ఆది… సేమ్ టు సేమ్‌

2019 Latest Telugu Movie News, Interesting Coincidence Between Rajasekhar and Aadi, Rajasekhar and Aadi movie going to release on same day, kalki movie release date, kalki movie latest news, kalki movie updates, Operation Gold Fish movie release date, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Interesting Coincidence Between Rajasekhar and Aadi

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా భలే గమ్మత్తుగానూ, ఆసక్తికరంగానూ అనిపిస్తాయి. అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే… సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌, యంగ్ హీరో ఆది విష‌యంలో రెండేళ్ళ క్రితం జ‌రిగింది, మ‌ళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే… 2017 నవంబర్ 3న సీనియర్ హీరో రాజశేఖర్ క‌థానాయ‌కుడిగా నటించిన ‘పి.ఎస్‌.వి గరుడవేగ 126.18M’ చిత్రం విడుదలైంది. అదే రోజున యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాల తరువాత ఈ ఇద్దరు హీరోల నుంచి 2018లో ఒక్క సినిమా కూడా తెరపైకి రాలేదు. కట్ చేస్తే… 2019లో మళ్ళీ ఒకే రోజున ఈ ఇద్దరు హీరోలు తమ తమ కొత్త‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ చిత్రాలే రాజశేఖర్ నటించిన ‘కల్కి’, ఆది నటించిన ‘బుర్రకథ’. ఈ రెండు సినిమాలు జూన్ 28న థియేటర్‌లలోకి రానున్నాయి. గ‌త సంద‌ర్భంలో రాజ‌శేఖ‌ర్‌కి మాత్ర‌మే విజ‌యం ద‌క్కింది. మ‌రి ఈ సారి… ఇద్ద‌రికీ విజ‌యాలు ద‌క్కుతాయేమో చూడాలి. అన్న‌ట్టు… రాజ‌శేఖ‌ర్ న‌టించిన ప‌లు చిత్రాల‌కు ఆది తండ్రి, న‌టుడు సాయికుమార్ డ‌బ్బింగ్ చెప్పారు. వాటిలో ప‌లు ఘ‌న‌విజ‌యాలున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=d-XXlkh6x18]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here