డబ్బింగ్ లో చిరంజీవి రికార్డ్

2019 Latest Telugu Movie News, Chiranjeevis Sye Raa movie latest news, Chiranjeevi Creates a New Record with Sye Raa Narasimha Reddy, Sye Raa finally wraps the dubbing, sye raa narasimha reddy cast Dubbing Part Wrapped Up, Sye Raa Narasimha Reddy dubbing part finished, Sye Raa Narasimha Reddy Movie Dubbing Part Wrapped Up, Sye Raa Narasimha Reddy Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Chiranjeevi Creates a New Record with Sye Raa Narasimha Reddy

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి బయోపిక్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతుంది. నయనతార, తమన్నా కథానాయికలు కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సైరా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 10 రోజుల క్రితం చిరంజీవి తన పాత్ర కు శబ్దాలయా స్టూడియో లో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. సైరా మూవీ లోని తన క్యారెక్టర్ కున్న భారీ డైలాగ్ లను 20గంటలలో డబ్బింగ్ చెప్పి చిరంజీవి రికార్డ్ క్రియేట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్న సైరా నరసింహా రెడ్డి మూవీ తెలుగు తోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=lTEXo8m87LM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.