మ‌రోసారి డ‌బ్బింగ్ చెప్పిన నివేదా థామ‌స్‌

2019 Latest Telugu Movie News, Nivetha Thomas Dubs For Her Role Again, Nivetha Thomas gives her voice for new movie,Actress Nivetha Thomas own voice movies, Brochevarevarura movie updates, Nivetha Thomas voice in Brochevarevarura movie, Brochevarevarura movie latest news,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Nivetha Thomas Dubs For Her Role Again

`జెంటిల్‌మ‌న్‌` (2016)తో టాలీవుడ్‌కి క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నివేదా థామ‌స్‌. ఆ చిత్రంతో మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాకుండా న‌టిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌రువాత ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’ చిత్రాల‌తోనూ అల‌రించింది నివేదా. ఇక ఇటీవల విడుదలైన ‘118’తో మరో విజయాన్ని అందుకున్న ఈ భామ… ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే… నివేదా కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’ విడుదలకు సిద్ధమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్‌గా ఎదగాలనుకునే పాత్రలో నటించింది నివేదా. అంతేకాదు, ఈ చిత్రం కోసం తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తన మొద‌టి తెలుగు సినిమా ‘జెంటిల్‌మ‌న్‌’లోనే తన గొంతు వినిపించాలని ముచ్చట పడిన నివేదాకు… ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఆ ముచ్చట తీరినట్ల‌య్యింది. నివేదా డబ్బింగ్ చెప్పిన ‘118’ మంచి విజయాన్నే అందుకున్న‌ నేపథ్యంలో… ‘బ్రోచేవారెవరురా’ కూడా ఆ బాటే ప‌డుతుందేమో చూడాలి. కాగా… ‘బ్రోచేవారెవరురా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=lrDxY7WHkDs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 1 =