
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 41

శర్వానంద్... సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి

భరతనాట్యం కళాకారిణిగా అనుపమ పరమేశ్వరన్

క్యాబ్ డ్రైవర్‌గా సమంత?
వైజాగ్‌లో `వెంకీమామ` నయా షెడ్యూల్

విజయ్ దేవరకొండతో విక్రమ్ మూవీ?

కర్ణాటకలో ‘సైరా’కి సూపర్ బిజినెస్ డీల్?

అప్పుడు సాయి పల్లవి - ఇప్పుడు నాగ చైతన్య

రణరంగం టీజర్ రిలీజ్

విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!

సోషల్ అవేర్నెస్ పై షార్ట్ ఫిల్మ్

సందీప్ వంగాతో సల్మాన్ సినిమా..!

బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు

‘ఓ బేబీ’కి ‘ఈగ’ సెంటిమెంట్!

'రణరంగం' సర్ ప్రైజింగ్ అప్ డేట్

ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా నటించే కొత్త సినిమా ఆదివారం (జూన్ 30వ తేదీ )పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషొర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టిన శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభమవుతుంది. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. శ్రీకారం మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
శర్వానంద్... సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి
ప్రస్తుతం `రణరంగం`, `96` రీమేక్‌తో బిజీగా ఉన్న యువ కథానాయకుడు శర్వానంద్... తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. `శ్రీకారం` పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా కిశోర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. కాగా... ఆగస్టు తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

భరతనాట్యం కళాకారిణిగా అనుపమ పరమేశ్వరన్
`అఆ`, `ప్రేమమ్`, `శతమానంభవతి` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది అనుపమ పరమేశ్వరన్. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో... తన తదుపరి చిత్రం `రాక్షసుడు`పైనే ఆశలు పెట్టుకుంది ఈ కేరళకుట్టి. తమిళ బ్లాక్‌బస్టర్ `రాక్షసన్`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టీచర్ పాత్రలో కనిపించనుంది అనుపమ.

క్యాబ్ డ్రైవర్‌గా సమంత?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. ఓ వైపు కమర్షియల్ చిత్రాల హీరోయిన్గా మురిపిస్తూనే... మరో వైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ అలరిస్తోంది సామ్. ఈ నేపథ్యంలోనే... ఈ నెల 5న `ఓ బేబీ`తో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యేలోపే... మరో విదేశీ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు... ఇందులో క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తుందని టాక్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి `అర్జున్ రెడ్డి`కి దర్శకత్వ శాఖలో…
వైజాగ్‌లో `వెంకీమామ` నయా షెడ్యూల్
`ఎఫ్ 2` వంటి ఘనవిజయం తరువాత విక్టరీ వెంకటేష్, `మజిలీ` వంటి బ్లాక్‌బస్టర్ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ... తాజాగా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దాదాపు 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో ఆర్మీ నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాలను, పోరాట ఘట్టాలను చిత్రీకరించారు. దీంతో 75 శాతం టాకీపార్ట్ పూర్తయిందని టాక్.

‘ఐకాన్’లో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో అల్లు అర్జున్?
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా... రెండోది వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఐకాన్’మూవీ. ఇక మూడోది సుకుమార్ కాంబినేషన్ మూవీ.

విజయ్ దేవరకొండతో విక్రమ్ మూవీ?
వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు సిద్ధం కాగా... క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రేకప్’(ప్రచారంలో ఉన్న పేరు), ఆనంద్ అన్నామలై డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘హీరో’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ క్రేజీ స్టార్‌తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయడానికి బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ టాక్.

కర్ణాటకలో ‘సైరా’కి సూపర్ బిజినెస్ డీల్?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని ట్రేడ్ టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం... కన్నడనాట ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని తెలిసింది.

ఆది కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఆది హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ్ బై లింగ్వల్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 'జంగిల్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సినిమాకు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అప్పుడు సాయి పల్లవి - ఇప్పుడు నాగ చైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఫిదా సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినా... సాయి పల్లవికే క్రేడిట్ దక్కిందని చెప్పొచ్చు. దానికి కారణం తన నటన.. నటనతో పాటు తెలంగాణ స్లాంగ్. సాయిపల్లవి వల్ల తెలంగాణ భాషకే ఓ అందం వచ్చిందేమో అన్నట్టు ఉంది.. తను మాట్లాడటం వల్ల.

రణరంగం టీజర్ రిలీజ్
'స్వామి రారా', 'దోచేయ్', 'కేశవ' సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ, శర్వానంద్ కాంబినేషన్ లో రణరంగం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ లోనే తొలి సారిగా గ్యాంగ్ స్టర్ గా శర్వా నటిస్తున్న చిత్రం 'రణరంగం'. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా తీయాలని ఉంది అన్న రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవన్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్.

సోషల్ అవేర్నెస్ పై షార్ట్ ఫిల్మ్
సియోటెల్ బేస్డ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కంపెనీ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలకు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, కో ప్రొడక్షన్ , ఈవెంట్స్ కు సేవలు అందిస్తుంది. US , ఇండియా కార్పొరేట్ సంస్థలకు సర్వీస్ లు అందిస్తుంది. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ భాగస్వామ్యం తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన గూఢచారి మూవీ ఘనవిజయం సాధించింది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ తో కలసి అనుష్క హీరోయిన్ గా సైలెన్స్ మూవీ ని రూపొందిస్తుంది.

సందీప్ వంగాతో సల్మాన్ సినిమా..!
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కబీర్ సింగ్. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఆయన ఓ చిత్రం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ మూవీ నిర్మించడానికి సన్నాహాలు…

బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు
యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘అశోక చక్రవర్తి’ ఒకటి. మలయాళ చిత్రం ‘ఆర్యన్’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రంలో అంజలీదేవి, జె.వి.సోమయాజులు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, ‘శుభలేఖ’ సుధాకర్, రంగనాథ్, శరత్ సక్సేనా, సుపర్ణా ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి కాజా వెంకటరావమ్మ ఈ సినిమాని నిర్మించారు.

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ ఒకటి. వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.అశోక్ కుమార్ నిర్మించారు. వెంకటేష్ సరసన రజిని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘ఊర్వశి’ శారద, భానుచందర్, రోహిణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

‘ఓ బేబీ’కి ‘ఈగ’ సెంటిమెంట్!
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జూలై 5న విడుదల కానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... సెంటిమెంట్ పరంగా జూలై మొదటి వారంతో సామ్‌కు మంచి అనుబంధమే ఉంది.

'రణరంగం' సర్ ప్రైజింగ్ అప్ డేట్
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రణరంగం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. షూటింగ్ సమయంలో శర్వానంద్ భుజానికి గాయమవడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో శర్వానంద్ దాదాపు రెండు నెలల వరకూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నుండి సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమైంది చిత్రయూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా టీజర్ రిలీజ్ డేట్ నుతెలిపారు. రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఓ బేబీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఓ బేబీ కొరియన్ మూవీ మిస్ గ్రానీ కి రీమేక్ మూవీ. ఓ బేబీ మూవీ ప్రమోషన్స్ లో సమంత బిజీగా ఉన్నారు.

కాప్పాన్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
కెవి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా కాప్పాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళ్ తో పాటు సూర్యకి తెలుగులో ఉన్న క్రేజ్ ను బట్టి ఇక్కడ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ఈరోజు. నిజానికి నిన్ననే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేయాలి కానీ.. విజయనిర్మల మరణంతో ఈరోజు రిలీజ్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి కాప్పాన్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాకు బందోబస్ట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.