నీల తామర మూవీ తో మల్లువుడ్ కు పరిచయమైన అమలాపాల్ కోలీవుడ్ లో నటించిన మైనా మూవీ ఘనవిజయం సాధించింది. బెజవాడ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన అమలాపాల్ నటించిన లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో మూవీస్ విజయం సాధించాయి. అమలాపాల్ ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. అమలాపాల్ నగ్నం గా నటించిన ఆడై తమిళ మూవీ టీజర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
సక్సెస్ ఫుల్ హీరో విజయ్ సేతుపతి నటించే మూవీ లో నిర్మాత రత్న కుమార్ అమలాపాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. తరువాత రత్నకుమార్ ఆ మూవీ నుండి అమలాపాల్ ను తప్పించారు. ఎక్కువ రెమ్యునరేషన్, కొత్త షరతులు విధించడంతో అమలాపాల్ ను తప్పించినట్టుగా వివరణ ఇచ్చారు. అమలాపాల్ తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు
చేసి విజయ్ సేతుపతి మూవీ నుండి తప్పించారని ఆరోపించారు. ఆడై మూవీ కారణంగా వారి మూవీ పై నెగిటివ్ కామెంట్స్ వస్తాయని తనను తొలగించారని, ఇలాంటి ఆలోచనా విధానాన్ని మార్చుకొంటేనే చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని, తన సినీ కెరీర్ లో అనేక నిర్మాణ సంస్థలకు మద్దతు ఇచ్చానని, తనకు రావాల్సిన రెమ్యునరేషన్స్ చాలా సార్లు వదులుకున్నానని అమలాపాల్ ప్రెస్ నోట్ లో తెలిపారు.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.