హిందీ ‘జెర్సీ’కి నిర్మాత‌గా ‘దిల్’ రాజు?

2019 Latest Telugu Movies News, Dil Raju To Produce Jersey Movie In Hindi, producer Dil Raju taking copy rights of jersey in hindi, Dil Raju To Remake Jersey In Hindi, producer Dil Raju movie news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News , jersey remake movie updates
Dil Raju To Produce Jersey Movie In Hindi
టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ‘దిల్’ రాజు… ఎప్పటినుంచో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేయాలని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అయితే… మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌కు… ‘భారతీయుడు’ సీక్వెల్‌ ‘భారతీయుడు 2’ని తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా నిర్మించే అవకాశం దక్కినా… కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో… త‌నే నిర్మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఎఫ్ 2’ని హిందీలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు ‘దిల్’ రాజు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారాయ‌న‌. అంతేకాదు… తాజాగా మరో తెలుగు చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు `దిల్‌` రాజు సన్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఆ వివరాల్లోకి వెళితే… నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్‌గా నిలచిపోయే ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేయడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. క్రికెట్ నేప‌థ్యంలో సాగే ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని మరో ప్రముఖ నిర్మాణ‌ సంస్థతో కలసి నిర్మించే ఆలోచనలో `దిల్‌` రాజు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే… మ‌రోవైపు ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ కూడా ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్న నేప‌థ్యంలో… కరణ్ జోహార్‌తో కలసి ‘దిల్’ రాజు నిర్మించనున్నారో లేక మరే ఇత‌ర సంస్థ‌తోనైనా కలసి నిర్మించ‌నున్నారో అనే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=rtvFHmNWo3I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =