‘సైరా’… డ‌బ్బింగ్ పూర్తి చేసిన చిరు

2019 Latest Telugu Movie News, Chiranjeevis Sye Raa movie latest news, Its a wrap up for Chiranjeevis Sye Raa Narasimha Reddy, Sye Raa finally wraps the dubbing, sye raa narasimha reddy cast Dubbing Part Wrapped Up, Sye Raa Narasimha Reddy dubbing part finished, Sye Raa Narasimha Reddy Movie Dubbing Part Wrapped Up, Sye Raa Narasimha Reddy Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Sye Raa Narasimha Reddy Movie Dubbing Part Wrapped Up
బ్రిటీష్ వారిని, వారి ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించిన‌ తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయ‌న జీవితం ఆధారంగా ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ సినిమా తెరకెక్కిన‌ సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్, నయనతార, త‌మ‌న్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్రలు పోషించిన‌ విషయం విదితమే. ఇదిలా ఉంటే… తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామా… ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. చిత్రీకరణ పూర్తవడానికి ముందు నుంచే శబ్దాలయ స్టూడియోస్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్న చిరు… రీసెంట్‌గా డబ్బింగ్ పార్టును కూడా కంప్లీట్ చేసారని సమాచారం. కేవలం 20 గంటల్లోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారట చిరు. కాగా… ఆగస్టు మూడో వారానికల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింద‌ని టాక్. ఇకపోతే… చిరు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న `సైరా` ట్రైలర్‌ను విడుదల చేసి… గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబర్ 2న సినిమాని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=_phcQ0DrIVM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.