‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘కేశవ’ సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ, శర్వానంద్ కాంబినేషన్ లో రణరంగం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ లోనే తొలి సారిగా గ్యాంగ్ స్టర్ గా శర్వా నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో కాజల్, కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న విడుదల చేయాలనీ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రానికి మాటలు : అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం : దివాకర్ మణి, ఎడిటర్ : నవీన్ నూలి, పాటలు : రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య, పోరాటాలు :వెంకట్, నృత్యాలు: బృంద, శోభి, శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : సి.హెచ్.రామకృష్ణ రెడ్డి.
ఇదిలా ఉండగా తమిళ సూపర్ హిట్ మూవీ ’96’ రీమేక్ లో కూడా నటిస్తున్న శర్వా ‘స్కై డ్రైవింగ్’ లో గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది.
[subscribe]
[youtube_video videoid= BXxQ9I8y1rA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: