విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో విక్రమ్ మూవీ?

2019 Latest Telugu Movie News, Vijay Deverakonda to Share Screen with Vikram, Vijay Deverakonda next movie with Director vikram, Director vikram upcoming project with Vijay Deverakonda, Vijay Deverakonda To Make A Movie With Vikram, Vijay Deverakonda next movie updates, Vijay Deverakonda movie under direction Vikram, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Vijay Deverakonda to Share Screen with Vikram
వైవిధ్యభరితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు సిద్ధం కాగా… క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రేకప్’(ప్రచారంలో ఉన్న పేరు), ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ‘హీరో’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ క్రేజీ స్టార్‌తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ చేయడానికి బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే… ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన విక్రమ్ కుమార్… ప్రస్తుతం నాని హీరోగా `గ్యాంగ్ లీడర్`ను రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కావ‌స్తున్న నేప‌థ్యంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజయ్‌తో చేయ‌డానికి విక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు… ఇప్ప‌టికే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కథను సిద్ధం చేసాడట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌ను త్వ‌ర‌లోనే కలసి తన స్క్రిప్ట్‌ను వినిపించనున్నాడట విక్రమ్. కాగా… ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నాడ‌ని టాక్. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలను తెరకెక్కించే విక్రమ్… అటువంటి కథలనే ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న విజయ్… ఈ ఇద్ద‌రి కలయికలో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= KqwatWYFI7o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 11 =