‘ఓ బేబీ’కి ‘ఈగ’ సెంటిమెంట్!

2019 Latest Telugu Movie News, Eega sentiment for oh baby movie, Oh Baby Has A Similarity With Eega, oh baby movie event release updates, oh baby movie release date, samantha oh baby movie latest news, samantha oh baby movie updates, Samantha Upcoming Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Oh Baby Has A Similarity With Eega

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జూలై 5న విడుదల కానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే… సెంటిమెంట్ ప‌రంగా జూలై మొదటి వారంతో సామ్‌కు మంచి అనుబంధమే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… స‌మంత కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల‌లో `ఈగ‌` ఒక‌టి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ సినిమా … 2012 జూలై మొదటి వారం (జూలై 6న)లో విడుదలై ఘనవిజయం సాధించింది. అందులో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్రలో నటించి అల‌రించిన‌ సామ్‌కి… స‌ద‌రు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మంచి పేరు తెచ్చి పెట్టింది. అంతేకాదు… అప్ప‌టికే హ్యాట్రిక్ విజయాలను (‘ఏ మాయచేసావే’, ‘బృందావనం’, ‘దూకుడు’)తన ఖాతాలో వేసుకుని మంచి జోరు మీదున్న సామ్‌కి… కెరీర్ పరంగానూ ‘ఈగ’ సినిమా మరింత బూస్టప్ ఇచ్చింది. కట్ చేస్తే… ఇప్పుడు మళ్ళీ అదే జూలై మొదటి వారాన్ని టార్గెట్ చేస్తూ సామ్ కొత్త చిత్రం ‘ఓ బేబీ’ విడుద‌ల కాబోతోంది. మ‌రి… ‘ఈగ’ సెంటిమెంట్ `ఓ బేబీ`కి కూడా రిపీట్ అయి సామ్ ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ చేరుతుందేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =