బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు

#Balakrishna, 2019 Latest Telugu Movie News, 30 Glorious Years for Balakrishna ashok chakravarti, 30 years for ashok chakravarti, balakrishna actor, Balakrishna ashok chakravarti, Balakrishna latest movies, Balakrishna New Movie Updates, Balakrishna Starrer Ashoka Chakravarthy Completes 30 Years, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Balakrishna Starrer Ashoka Chakravarthy Completes 30 Years

యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీస్‌కి పెట్టింది పేరు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ నేపథ్యంలో బాలయ్య‌ క‌థానాయ‌కుడిగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘అశోక చక్రవర్తి’ ఒకటి. మల‌యాళ చిత్రం ‘ఆర్యన్’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రంలో అంజలీదేవి, జె.వి.సోమయాజులు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, ‘శుభలేఖ’ సుధాకర్, రంగనాథ్, శరత్ సక్సేనా, సుపర్ణా ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి కాజా వెంకటరావమ్మ ఈ సినిమాని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జాలువారిన గీతాలకు “మ్యాస్ట్రో” ఇళయరాజా స్వరకల్పన చేసారు. మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలచిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. వాటిలో “ఎందరో మహానుభావులు”, “ఝనకు ఝనకు ఝాం”, “సువ్వి సువ్వి”, `అబ్బ రూప‌మెంత‌` గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ పాటల్లో బాలయ్య వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. 1989 జూన్ 29న విడుదలైన ‘అశోక చక్రవర్తి’… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=Beb6rhfh8Ew]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =