వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, 30 Glorious Years for Venkatesh dhruva nakshatram, 30 years for dhruva nakshatram, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh, Venkatesh actor, Venkatesh dhruva nakshatram, Venkatesh dhruva nakshatram completed 30 years, Venkatesh New Movie Updates, Venkatesh Starrer Dhruva Nakshatram Completes 30 Years
Venkatesh Starrer Dhruva Nakshatram Completes 30 Years

‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ ఒకటి. వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.అశోక్ కుమార్ నిర్మించారు. వెంకటేష్ సరసన రజిని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘ఊర్వశి’ శారద, భానుచందర్, రోహిణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ త‌దిత‌రులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌ను అందించిన ఈ సినిమాకి… స్వరకర్త చక్రవర్తి బాణీలు అందించ‌గా ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామూర్తి గీత రచన చేశారు. “ఈ అర్ధరాత్రిలోన పాపా”, “కసిగా ఓ కౌగిలి ఇస్తా”, “రంభలకి రంగులకి”, “హౌలే హౌ లవ్లీ లవ్” గీతాల‌తో పాటు… “పెళ్లి పెళ్లి ” అనే పాట (హాసన్ జహంగీర్ పాడిన “హవా హవా”కి తెలుగు వెర్ష‌న్‌) ఆ రోజుల్లో విశేషాద‌ర‌ణ పొందాయి. 1989 జూన్ 29న విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన ‘ధ్రువనక్షత్రం’… నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

ఈ చిత్రాన్ని హిందీలో ‘జీవన్ ఏక సంఘర్ష్’ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు పునర్నిర్మించగా… ఆ సినిమా కూడా విజయం సాధించడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=hvS33iNEz5U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 13 =