ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 40
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'

కోలుకున్న నాగశౌర్య.. బ్యాక్ టు షూట్
కుటుంబకథా చిత్రం "జరిగిన కథ" కు 50 ఏళ్ళు
మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో సామ్?

సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్

`మన్మథుడు 2`లో నాగ్ పాత్ర అదేనా?

బాలీవుడ్‌లో నెలకో తెలుగు దర్శకుడి ఎంట్రీ

ఒకే బాటలో వెంకీ, ప్రభాస్ చిత్రాలు

గ్యాంగ్ లీడర్` నయా షెడ్యూల్ అప్‌డేట్

లేటెస్ట్ అప్ డేట్స్ కోసం 'తెలుగు ఫిలింనగర్ యాప్'

'ఆమె' రిలీజ్ డేట్ ఫిక్స్
జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్

తెలుగు, తమిళ మూవీస్ షూటింగ్స్ లో బిజీ
అన్నాదమ్ముళ్లు ఎనిమిదేళ్ల తరువాత
తమిళ ఇండస్ట్రీలో ఒకరు నటుడిగా.. ఒకరు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రదర్స్ ధనుష్, సెల్వ రాఘవన్ అని చెప్పొచ్చు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో హిట్ మూవీస్ కూడా వచ్చాయి. కాదల్ కొండియన్ (తెలుగులో నేను అనే సినిమా చేశాడు అల్లరి నరేష్), పుదుపెట్టయ్, మయక్కమ్ ఎన్న అనే మూడు సూపర్ హిట్ ఫిలింస్ వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషనల్ లో సినిమా రాబోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్
తెలుగు సినీ పరిశ్రమ అనే కానీ.. ఇక్కడ హవా చాటుతున్నది మాత్రం వేరే రాష్ట్రాల హీరోయిన్స్ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, బొంబాయి ఇలా పలు ప్రాంతాల నుండి హీరోయిన్స్ దిగుమతి అవుతుంటారు టాలీవుడ్ కి. ఇక్కడ లక్ కలిసొచ్చి ఒక్క సినిమా హిట్ అయిందా ఇక అంతే ఇక్కడ వరుసపెట్టి అవకాశాలు వచ్చేస్తాయి. అలా పక్క రాష్ట్రాల నుండి మన ఇండస్ట్రీ కి వచ్చి తిష్ట వేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు హీందీ వాళ్లు హవా చేస్తే... ఆ తరువాత మలయాళీ ముద్దు గుమ్మలు.. ఇప్పుడు కన్నడ భామలు తెలుగులో తమ హవా కొనసాగిస్తున్నారు.

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావుకి అచ్చొచ్చిన కథానాయికల్లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం `వేటగాడు`. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో జగ్గయ్య, కాంతారావు, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నగేష్, చలపతిరావు, పుష్పలత, పండరీబాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జున్‌రాజు, కె.శివరామరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వరకర్త చక్రవర్తి అందించిన బాణీలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఓ బేబి'
సమంత ప్రధాన పాత్రలో కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రేపు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది.

కోలుకున్న నాగశౌర్య.. బ్యాక్ టు షూట్
రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నాగశౌర్య గాయపడిన సంగతి కూడా విదితమే. స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి ఆధారం లేకుండా, డూప్ సహాయం తీసుకోకుండా 15అడుగుల ఎతైన భవనం పై నుండి దూకడంతో ఆయన మోకాలికి బలమైన గాయమైంది. దీంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
కుటుంబకథా చిత్రం "జరిగిన కథ" కు 50 ఏళ్ళు
“అనుమానం పెనుభూతం” అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జరిగిన కథ’. అన్నదమ్ముల ఆదర్శం, ఆలుమగల అనురాగం, తల్లీబిడ్డల మమకారం వంటి అంశాలతో ప్రేక్షకులను అలరించిన సినిమా. “కళావాచస్పతి” జగ్గయ్య, సూపర్ స్టార్ కృష్ణ, కాంచన ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాగయ్య, రాజనాల, రాజబాబు, బాలకృష్ణ, అల్లురామలింగయ్య, ప్రభాకరరెడ్డి, సంధ్య, విజయలలిత, మంజుల, సబిత, బేబీ రోజారమణి తదితరులు ఇతర భూమికలను పోషించారు. కె.బాబూరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగావళీ (విజేతా) ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.ప్రభాకర్ నిర్మించారు.
మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో సామ్?
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత... గత రెండేళ్లుగా నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌గా విడుదలైన ‘యూటర్న్’, ‘రాజుగారి గది 2’ చిత్రాలలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... రేపు (జూలై 5న) విడుదల కానున్న ‘ఓ బేబీ’లో మరోసారి అటువంటి పాత్రలోనే దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు తమిళంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేయబోతోందట సామ్.

సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్
ఇప్పుడున్న టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా... సమంత ఉంటే సినిమా హిట్టే అన్న రేంజ్ కు ఎదిగింది. దీనికి కారణం ఆమె ఎంచుకునే కథలు కూడా కారణమే అని చెప్పొచ్చు. అందుకే దాదాపు ఎక్కువ హిట్ సినిమాలనే తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్యం ఏంటంటే.. పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు సమంతకు స్టార్ హీరో ట్రీట్మెంట్ దక్కుతుంది.

`మన్మథుడు 2`లో నాగ్ పాత్ర అదేనా?
`మన్మథుడు`కి 2.0 వెర్షన్‌గా తెరకెక్కుతున్న చిత్రం `మన్మథుడు 2`. కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. `చి.ల.సౌ` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో నాగార్జున పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... `మన్మథుడు`లో యాడ్ కంపెనీ ఓనర్‌గా కనిపించిన నాగ్... `మన్మథుడు 2`లో పెర్వ్యూమ్ కంపెనీ ఓనర్‌గా…

బాలీవుడ్‌లో నెలకో తెలుగు దర్శకుడి ఎంట్రీ
హిందీనాట పలువురు తెలుగు దర్శకులు తమదైన ముద్రవేశారు. అయితే, వరుస నెలల్లో టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం అరుదైన విషయమనే చెప్పాలి. ఈ ఏడాది అలాంటి అరుదైన సంఘటనే హిందీనాట చోటుచేసుకుంటోంది. జూన్, జులై, ఆగస్టు... ఇలా ఈ మూడు నెలల్లో మన దర్శకులు వరుసపెట్టి అక్కడ రంగప్రవేశం చేస్తున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు... సందీప్ రెడ్డి వంగా, ప్రకాష్ కోవెలమూడి, సుజీత్. ఇప్పటికే జూన్ 21న విడుదలైన `అర్జున్ రెడ్డి` రీమేక్ `కబీర్ సింగ్`(షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరోహీరోయిన్లు) తో సందీప్ బాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఇంప్రెషన్ వేస్తే... జులై 26న `జడ్జ్‌మెంటల్ హై…

ఒకే బాటలో వెంకీ, ప్రభాస్ చిత్రాలు
ఒకే తరహా పాయింట్‌తో ఒకే సమయంలో రెండు చిత్రాలు తెరకెక్కుతుండడం అప్పుడప్పుడు చోటుచేసుకునే వ్యవహారమే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే వైనం రెండు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో జరుగుతోందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే... విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకులుగా `వెంకీమామ` రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా... మామకి అల్లుడి వల్ల గండం ఉండడం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట. జ్యోతిష్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఈ పాయింట్‌నే కీలకమైన అంశమని సమాచారం. అయితే, ఈ వ్యవహారమంతా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని టాక్. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి…

శ్రీనివాస్ మోహన్ కు అరుదైన ఘనత - ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ లో సభ్యత్వం
ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనుక డైరెక్టర్, హీరో హీరోయిన్ల కష్టం ఎంత ఉంటుందో.. సాంకేతిక నిపుణుల కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. సినిమాకు డైరెక్షన్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా అన్నీ 24 ఫ్రేమ్ లు సమపాళ్లలో కుదిరితేనే ఒక సినిమా రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా.. అసలు మ్యాటరేంటంటే.. దర్శకుల కోరుకునే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ అందించగలిగే కొద్ది మందిలో శ్రీనివాస్ మోహన్ ఒకరు.

గ్యాంగ్ లీడర్` నయా షెడ్యూల్ అప్‌డేట్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 24వ చిత్రం `గ్యాంగ్ లీడర్`. `24` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా పరిచయమవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న `గ్యాంగ్ లీడర్`కి సంబంధించి తాజా షెడ్యూల్ ఈ నెల 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ఈ నెల 20 వరకు సాగే ఈ షెడ్యూల్‌లో కొంత టాకీతో పాటు ఓ పోరాట ఘట్టాన్ని కూడా…

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో పూర్ ఓటింగ్ - బట్ రేర్ మెజారిటీస్
నిర్మాతల సమస్యల పరిష్కారం, నిర్మాతల సంక్షేమ సాధన అనే లక్ష్యాలతో పని చేయవలసిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంటుంది. నిత్య అసంతృప్తి, నిత్య అసమ్మతి వాదం, నిత్య వివాదం నిత్య కృత్యమైన నిర్మాతల మండలి ఎన్నికలు నిన్న జరిగాయి. దాదాపు 1500 మంది సభ్యులున్న నిర్మాతల మండలి ఎన్నికల్లో కేవలం 477 ఓట్లు మాత్రమే పోల్ అవ్వటం మండలిలోని అభిప్రాయభేదాలకు, అనైక్యతకు అద్దం పడుతుంది. ఏది ఏమైనా నిన్నటి ఎలక్షన్స్ లో వార్ వన్ సైడ్ కావటం గమనార్హం. ఇటీవల జరిగిన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో మాదిరిగానే తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో కూడా War and Victory ఏకపక్షం…

లేటెస్ట్ అప్ డేట్స్ కోసం 'తెలుగు ఫిలింనగర్ యాప్'
స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైన కొద్దీ.. యాప్స్ కూడా ఎక్కవగానే వస్తున్నాయి. గూగుల్ స్టార్ లో రోజుకో యాప్ దర్శనమిస్తుంది. అన్ని యాప్స్ ఉపయోగపడకపోయినా.. కొన్ని యాప్స్ మాత్రం మనకు ఉపయోగపడుతుంటాయి. అలాంటి ఉపయోగపడే యాపే 'తెలుగు ఫిలింనగర్ యాప్'. ఇప్పటికే ది తెలుగుఫిలింనగర్.కామ్ అనే పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు మూవీ అప్ డేట్స్ ను ఇస్తున్న తెలుగు ఫిలింనగర్... ఇప్పుడు యాప్ ద్వారా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్, లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్లే స్టోర్ లోకి వెళ్లి తెలుగు ఫిలిం నగర్ యాప్ ను డౌన్…

తెలుగులోకి సాయిపల్లవి సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’
ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తెలుగులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె మలయాళంలో చేసిన ‘అథిరన్’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. వివేక్ దర్శకత్వంలో సాయి పల్లవి, ఫహాద్ ఫాజిల్, ప్రకాశ్‌రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’ మూవీ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.

'ఆమె' రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది అమలా పాల్. అంతేకాదు గతంలో సౌత్ లో ఏ హీరోయిన్ చేయని సాహసం చేసిందని అమలాపాల్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు కూడా. అలాగే విమర్శలు కూడా వచ్చాయనుకోండి.
జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్
నవతరం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో SV రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ జనసేన ఆధ్వర్యంలో నెలకొల్పనున్నామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పలువురు సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకుల పుట్టినిల్లు అయిన పాలకొల్లు లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నెలకొల్పడం, ఆ ఇన్ స్టిట్యూట్ కి దుర్యోధన, రావణ, ఘటోత్కచ, కంస, నరకాసుర, భీష్మ, హిరణ్యకశ్యప వంటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే లెజండరీ నటుడు, నిర్మాత, దర్శకుడు SV రంగారావు పేరుపెట్టడం ముదావహం.

తెలుగు, తమిళ మూవీస్ షూటింగ్స్ లో బిజీ
ఊహలు గుస గుస లాడే వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇమైక్క నొడిగళ్ సక్సెస్ ఫుల్ తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన అడంగమారు, అయోగ్య మూవీస్ విజయం సాధించాయి.
పాట చిత్రీకరణలో `మన్మథుడు 2`
17 ఏళ్ళ క్రితం `మన్మథుడు`గా ఇంటిల్లపాది వినోదాలు పంచిన కింగ్ నాగార్జున... ఇప్పుడు `మన్మథుడు`కి 2.0 వెర్షన్‌గా `మన్మథుడు 2` చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. సమంత, కీర్తి సురేష్ తళుక్కున మెరవనున్నారు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న `మన్మథుడు 2`... ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.