`ఎఫ్ 2` వంటి ఘనవిజయం తరువాత విక్టరీ వెంకటేష్, `మజిలీ` వంటి బ్లాక్‌బస్టర్ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ… తాజాగా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దాదాపు 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో ఆర్మీ నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాలను, పోరాట ఘట్టాలను చిత్రీకరించారు. దీంతో 75 శాతం టాకీపార్ట్ పూర్తయిందని టాక్.
కాగా, ఇప్పుడు `వెంకీమామ` కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇక్కడ ప్రధాన తారాగణంపై పలు ఆసక్తికరమైన దృశ్యాలను చిత్రీకరించనున్నారని సమాచారం. అనంతరం హైదరాబాద్‌లో జరిపే చివరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది.
వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో `వెంకీమామ` థియేటర్లలోకి రానుంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.