భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

2019 Latest Telugu Movie News, Anupama Parameshwaran In The Role Of Bharatanatyam Dancer , Anupama Parameshwaran latest movie news, Anupama Parameshwaran as a Bharatanatyam Dancer, Anupama Parameshwaran character in next movie, Anupama Parameshwaran to play intresting role, Anupama Parameshwaran next movie updates, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Anupama Parameshwaran In The Role Of Bharatanatyam Dancer
`అఆ`, `ప్రేమ‌మ్‌`, `శ‌తమానంభ‌వ‌తి` చిత్రాల‌తో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. అయితే, ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో… త‌న త‌దుప‌రి చిత్రం `రాక్ష‌సుడు`పైనే ఆశ‌లు పెట్టుకుంది ఈ కేర‌ళ‌కుట్టి. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `రాక్ష‌స‌న్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది అనుప‌మ‌. కాగా… ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ సారి… భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణిగా అనుప‌మ క‌నిపిస్తుందట‌. అయితే, అది తెలుగు చిత్రం కోసం కాదు… ఓ త‌మిళ సినిమా కోసం. ఆ వివ‌రాల్లోకి వెళితే… `వాల్మీకి` ఫేమ్ అధ‌ర్వ ముర‌ళి హీరోగా క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్క‌నుంది. జూలై 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాలోనే అనుప‌మ క్లాసిక‌ల్ డాన్స‌ర్‌గా క‌నిపిస్తుంద‌ట‌. `కొడి` (2016) త‌రువాత అనుప‌మ న‌టించ‌నున్న కోలీవుడ్ మూవీ ఇదే కావ‌డం విశేషం. మ‌రి… క్లాసిక‌ల్ డాన్స‌ర్‌గా అనుప‌మ ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= K2Ek6i2yB94]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 3 =