వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. ఓ వైపు కమర్షియల్ చిత్రాల హీరోయిన్‌గా మురిపిస్తూనే… మరో వైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ అలరిస్తోంది సామ్. ఈ నేపథ్యంలోనే… ఈ నెల 5న `ఓ బేబీ`తో సందడి చేయనుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కొరియన్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యేలోపే… మరో విదేశీ చిత్రం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో నటించేందుకు సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు… ఇందులో క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తుందని టాక్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకి `అర్జున్ రెడ్డి`కి దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం గిరీశయ్య `అర్జున్ రెడ్డి` తమిళ వెర్షన్ `ఆదిత్య వర్మ`ని డైరెక్ట్ చేస్తున్నాడు. అది విడుదలయ్యాకా సామ్ కాంబినేషన్ మూవీ స్టార్ట్ కావచ్చని తెలుస్తోంది. త్వరలోనే సామ్ – గిరీశయ్య చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.