శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఫిదా సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినా… సాయి పల్లవికే క్రేడిట్ దక్కిందని చెప్పొచ్చు. దానికి కారణం తన నటన.. నటనతో పాటు తెలంగాణ స్లాంగ్. సాయిపల్లవి వల్ల తెలంగాణ భాషకే ఓ అందం వచ్చిందేమో అన్నట్టు ఉంది.. తను మాట్లాడటం వల్ల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల తెలంగాణలో మాట్లాడించనున్నాడట. అయితే ఈసారి సాయి పల్లవితో కాదు.. నాగచైతన్యతో. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా… శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఈ సినిమాలో చైతుతో శేఖర్ కమ్ముల తెలంగాణ యాసలో మాట్లాడించనున్నాడట. చైతూ వీలును బట్టి తెలంగాణ యాసలో ఆయనకి శిక్షణ ఇప్పిస్తున్నాడట. ఈ పాత్ర పట్ల చైతూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వున్నాడని అంటున్నారు. మరి ఫిదా సినిమాలో తెలంగాణ యాస వల్ల సాయి పల్లవికి క్రేజ్ పెరిగింది… చైతు ఈ యాసని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=P4sfrrVrTrc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: